హోటల్స్, మాల్స్ లో “WASH BASIN” యూజ్ చేస్తున్నారా.? అయితే ఇది గమనించండి..లేకపోతే మీకు ప్రమాదమే.!

టెక్నాలజీ రోజు రోజుకీ మారుతోంది. ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ ఇప్పుడు లేదు. అన్ని రకాల పరికరాల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వాటి సైజ్‌ కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు కంప్యూటర్లు పెద్ద సైజ్‌లో ఉంటే ఇప్పుడు అరచేతిలో ఇమిడేంత సైజ్‌లోనే వచ్చాయి. ఇక సెక్యూరిటీ కోసం ఆయా ప్రదేశాల్లో బిగించే సీసీటీవీ కెమెరాలు కూడా చాలా తక్కువ సైజ్‌లోనే మనకు అందుబాటులో ఉంటున్నాయి. అయితే వీటిని చాలా మంది తప్పుడు పనుల కోసం వాడుతున్నారు. ముఖ్యంగా బట్టల దుకాణాలతోపాటు అనేక కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ఇతర చోట్ల ఉండే టాయిలెట్లలోనూ ఈ తరహా కెమెరాలను వాడుతున్నారు. వాటిని చూస్తే నిజంగా అవి కెమెరాలు అని తెలియవు. అంత తక్కువ సైజ్‌తో చాలా చిన్నగా ఉంటున్నాయి అవి.

చిత్రాల్లో చూశారు కదా. ఎంత చిన్నగా ఉంటున్నాయో ఆ కెమెరాలు. వీటిని స్పై కెమెరాలు అంటారు. ప్రస్తుతం చాలా మంది వీటిని వాడుతున్నారు. సీసీటీవీ కెమెరాలు అయితే పెద్దగా ఉంటాయి, దొరికిపోతాం అని చాలా మంది ఆలోచిస్తున్నారు. దీంతో ఈ తరహా కెమెరాలను డిజైన్‌ చేసి విక్రయిస్తున్నారు. వీటికి మార్కెట్‌లోనూ మంచి డిమాండ్‌ ఉంది. అన్ని ఈ-కామర్స్‌ సైట్లలోనూ ఈ కెమెరాలు లభిస్తున్నాయి.

చూసేందుకు చిన్న రంధ్రంలా ఉంటుంది. కానీ అది కెమెరా అని చాలా మందికి తెలియదు. అందులోనూ అది బట్టలు తగిలించుకునే హుక్‌కు ఉండడంతో అది ఏదైనా బోల్ట్‌ కావచ్చనే చాలా మంది అనుకుంటారు. కానీ బాగా పరిశీలిస్తే కానీ తెలియదు, అది కెమెరా అని. కనుక మీరు ఎవరైనా… ముఖ్యంగా మహిళలు బట్టల దుకాణాల్లో ట్ర‌య‌ల్ రూమ్స్ , ఇతర ప్రదేశాల్లో ఉండే వాష్‌ రూమ్స్‌కు వెళ్లినప్పుడు కచ్చితంగా డ్రెస్‌ హుక్‌లపై ఓ కన్నేయండి. వాటిని పరిశీలించండి. అలా నిర్దారణ చేసుకున్నాకే ముందుకు ప్రొసీడ్‌ అవండి. లేదంటే ఏదైనా తేడా ఉంటే వెంటనే సంబంధిత వ్యక్తుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయండి. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి కెమెరాలు ఉన్నాయని కూడా గుర్తుంచుకోండి..!

Comments

comments

Share this post

scroll to top