బాల్ పాయింట్ పెన్ తోలాక్ చేసిన బ్యాగ్ ను లాక్ చేసినట్టే ఉంచి లోపలున్న విలువైన సామాన్లను మాయం చేస్తారు.

మీరు ఎక్కువగా ప్రయాణిస్తుంటారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే మీ బ్యాగుల్లోని విలువైన వస్తువులను దొంగిలించేవారు మీ వెనకే పొంచి ఉంటారు. ఓ సింపుల్ ట్రిక్ తో లాక్ చేసిన బ్యాగ్ ను లాక్ చేసినట్టే ఉంచి లోపలున్న విలువైన సామాన్లను మాయం చేస్తారు. వారు ఉపయోగించే సింపుల్ టెక్నిక్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసా..? పెన్. అవును రాయడానికి ఉపయోగించే పెన్ ను కొందరు చోరీకి ఉపయోగిస్తారు.
  • బ్యాగ్‌లోని వస్తువులను దొంగిలించాలనుకున్న వ్యక్తికి దానికి ఉన్న లాక్/లాక్ కోడ్‌తో పనిలేదు.
  • దొంగ ఎప్పుడూ లాక్‌ను తెరిచేందుకు ప్రయత్నించడు. అందుకు తగ్గ వ్యవధి కూడా అతనికి ఉండదు. కేవలం తక్కువ సమయంలోనే దొంగతనం చేసి వెళ్లేందుకు యత్నిస్తాడు.
  • బాల్ పాయింట్ పెన్‌ ఉపయోగిస్తూ ఎంతో దృఢమైన లాక్‌ను కలిగి ఉన్నప్పటికీ ఆ బ్యాగ్ సులభంగా తెరుచుకుంటుంది.
  • పెన్‌తో బ్యాగ్ జిప్‌ను క్రాక్ చేయడం ద్వారా బ్యాగ్‌ను తెరిచిన దొంగ అందులోని వస్తువులను తస్కరిస్తాడు.
  • చివరికి బ్యాగ్ జిప్‌ను యథాతథంగా ఉండేలా చేస్తాడు. ఇందుకోసం లాక్‌ను కుడికి, ఎడమకు తిప్పితే సరిపోతుంది. జిప్ దానంతట అదే సెట్ అవుతుంది.
  • అయితే ప్రయాణికులకు మాత్రం ఈ విషయం గురించి ఏమీ తెలియదు. బ్యాగ్ తెరచి చూసుకునేదాక వారికి తమ వస్తువులు పోయాయని తెలియదు.
Watch Video:

Comments

comments

Share this post

scroll to top