న్యూ ఇయర్ కి “డీజే” పర్మిషన్ ఇవ్వండని అడిగాడు..”కేటీఆర్” రిప్లై చూస్తే మీరు నవ్వాపుకోలేరు..!

న్యూ ఇయర్ దగ్గరకొచ్చేస్తుంది..కుర్రకారే కాదు..చిన్న పిల్లలు,పెద్దోళ్లు న్యూ ఇయర్ రోజు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఇప్పటినుండే ప్లాన్స్ కూడా రెడీ చేసేసుకుంటారు.ముఖ్యంగా ఏముంటాయ్ అర్దరాత్రి పార్టీలు డిజె పెట్టుకుని ఫుల్ ఎంజాయ్ చేయడం..ఫ్రెండ్స్ అందరూ బైక్ రైడ్స్..లేదంటే మందుపార్టీలు….అయితే వాటన్నింటికి పర్మిషన్ లేకపోవడంతో ఒక కుర్రాడు ఏకంగా మన మంత్రిగారు కెటిఆర్ నే పర్మిషన్ అడిగాడు అది కూడా ట్విట్లర్లో..

మంత్రి కెటిఆర్ ట్విటర్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనకు తెలిసిందే..ఏదన్నా సమస్య ఉన్నా వెంటనే స్పందిస్తారు.అంతేకాదు తనలోని హాస్యప్రియున్ని కూడా ఒకసారి పరిచయం చేశారు ఈ మధ్య ఒక జోక్ ట్వీట్ చేసి అభిమానులను నవ్వుల్లో ముంచెత్తారు.మరోసారి ఇంకొకరు సాయం కోసం రెండు రాష్ట్రాల అధినేతలను కోరితే కెటిఆర్ వెంటనే స్పందించారు..ఇలా ఒకటి రెండే కాదు బోలెడు ఉదాహరణలున్నాయి కెటిఆర్ ట్విటర్ లో ట్వీట్స్ కి సంభందించి..అయితే  న్యూ ఇయర్ కి  డిజె పెట్టుకుంటాం పర్మిషన్ ఇవ్వండి సర్ అంటూ సాయికుమార్ అనే వ్యక్తి  ట్వీట్ చేస్తే దానికి కెటిఆర్ భలే చాతుర్యంతో స్పందించారు..అంతే కాదు కెటిఆర్ ఇచ్చిన ఆన్సర్ మనకు కూడా నవ్వుతెప్పిస్తుంది..ఇంతకీ ఆయనేం ఆన్సర్ ఇచ్చారో మీరే చూడండి..

Comments

comments

Share this post

scroll to top