పెళ్లి పీటలపై అన్నను పక్కకి తోసి…వధువుకు తాళి కట్టిన “పెళ్ళికొడుకు తమ్ముడు”..! తర్వాత ఏమైంది?

తమిళనాడు లోని ఒక పెళ్ళిలో జరిగిన ట్విస్ట్ ఇప్పుడు దేశం మొత్తం వైరల్ గా మారింది. పెళ్లి పీటలపై పెళ్ళి కొడుకు, కూతురు కూర్చున్నారు. పెళ్ళి కొడుకుని వధువుకి తాళి కట్టమని చెప్పాడు పురోహితుడు. పెళ్లి పీటలపై వధువు మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్న అన్నను పక్కకు తోసేసి తమ్ముడు తాళి కట్టిన సంఘటన తమిళనాడులోని వేలూరు సమీపంలో జరిగింది.

వెల్లురు జిల్లా తిరుపత్తూరు తాలుకా సెల్లరపట్టి గ్రామానికి చెందిన కామరాజ్‌ కు ముగ్గురు కుమారులు రంజిత్, రాజేష్, వినోద్‌ ఉన్నారు. వీరిలో రాజేష్, వినోద్‌ తిరుప్పూరులోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం రెండో కుమారుడు రాజేష్‌కు మదురైకి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు.


గురువారం ఉదయం దగ్గరలోని మురుగన్‌ ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు చేసారి ఇరు కుటుంబాలు. పెళ్లి పీటలపై కూర్చున్న రాజేష్ వధువు మెడలో మంగళ సూత్రం కట్టడానికి లేస్తుండగా పక్కనే ఉన్న అతని తమ్ముడు వినోద్‌, అన్నను పక్కకు తోసేసి తన జేబులో దాచుకున్న మరో తాళిని తీసి వధువు మెడలో కట్టాడు.దీంతో అక్కడున్నవారంత అవాక్యయ్యారు.


వధువు బంధువులు వినోద్‌పై దాడిచేసి పిడిగుద్దులు కురిపించారు. తల్లితండ్రులు అసలు విషయం కనుక్కోగా రాజేష్‌కు పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడే తనకు వధువు పరిచయం అయ్యిందని, అప్పటి నుండి తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిపాడు వినోద్. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు తెలిసింది. దీంతో పెళ్లి పీటలపై ఉన్న పెళ్లి కుమార్తెను చితక బాదారు. వరుడు రాజేష్‌ ఆవేదనకు గురై కంటతడితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Comments

comments

Share this post

scroll to top