లవర్ తో వీడియో కాల్ ఉండగా సూసైడ్ చేసుకున్న యువతి కేసులో కొత్త ట్విస్ట్.! అలా వెళ్తే.. ఎక్కడ తప్పుగా అనుకుంటాడోనని!

నేటి త‌రుణంలో కాలేజీల్లో చ‌దివే యువ‌తీ యువ‌కులు అన్నాక ల‌వ్‌లో ప‌డ‌డం కామ‌న్ అయిపోయింది. ఇక న‌గ‌రాల్లోని కాలేజీల్లో చ‌దివే యువ‌త అయితే ఇందులో అంద‌రిక‌న్నా కొంత ముందే ఉంటున్నారు. ప్రేమ‌లో ప‌డ‌డ‌మే కాదు, ఆ ప్రేమ విఫ‌లం అయినా, లేదా మ‌రేదైనా కార‌ణం ఉన్నా స‌రే ఆత్మ‌హత్య చేసుకుంటున్నారు. త‌మ నిండైన జీవితానికి మ‌ధ్య‌లోనే ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. నేటి త‌రుణంలో ఇలాంటి ఆత్మ‌హ‌త్య‌లు మ‌రీ ఎక్కువ‌య్యాయ‌నే చెప్ప‌వ‌చ్చు. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలోనూ ఇలాంటి ఓ ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న చోటు చేసుకుంది.

హైద‌రాబాద్‌లోని కొంప‌ల్లిలో ఉన్న శివ‌శివానీ కాలేజీలో అనీషా చౌద‌రి అనే యువ‌తి ఎంబీఏ చ‌దువుతోంది. ఈమెది అనంత‌పురం జిల్లా. ఈమె తండ్రి పేరు బుగ్గ‌య్య చౌద‌రి. ఇక ఈమె త‌మ కాలేజీలోనే చ‌దువుతున్న ద‌క్షిత్ ప‌టేల్ అనే యువ‌కుడిని గ‌త కొంత కాలంగా ప్రేమిస్తోంది. అయితే ఈమెకు స‌మ‌స్య ఉందో తెలియ‌దు కానీ.. తీవ్ర‌మైన మాన‌సిక వేద‌న‌కు లోనైంది. ల‌వ్ ఫెయిలా లేదంటే మ‌రేదైనా విష‌యం ఉందా అనేది తెలియదు. కానీ తాజాగా త‌న ప్రియుడు ద‌క్షిత్ ప‌టేల్‌తో అర్థ‌రాత్రి 2.30 గంట‌ల స‌మ‌యంలో వీడియో కాల్‌లో మాట్లాడుతూ స‌డెన్‌గా ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అసలేమైంది అనే వివరాల లోకి వెళ్తే..!

ఎవరి అనీషా?

అనంతపురం జిల్లాకు చెందిన జగ్గయ్య చౌదరి, కుమార్తె అనీషా చౌదరి (23) కొంపల్లిలోని శివశివానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్‌ లో ఉంటుంది. అదే కాలేజీలో చదువుతున్న మేడ్చల్‌ గ్రామానికి చెందిన దీక్షేశ్‌ పటేల్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇదిలా ఉండగా ఆమెకు గతంలో అనంతపురానికి చెందిన ఓ స్నేహితుడు ఉండేవాడు. ఇటీవలే అతని పెళ్లి కూడా కుదరడంతో అనీషాను ఆహ్వానించాడు. ఈ నెల 26న జరగనున్న తన స్నేహితుడి పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమైంది. పెళ్లికి వెళ్లాలా? వద్దా?  ఈ విషయమై ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి.

దక్షేశ్ పటేల్ కూడా అభ్యంతరం చెప్పలేదు:

దక్షేశ్ పటేల్ కూడా ఆమెకేమి అభ్యంతరం చెప్పలేదు. అనీషా పెళ్లికి వెళ్తానని అడగ్గానే వెళ్లమని చెప్పాడు. కానీ ఆ తర్వాత లేనిపోని అపోహలతో ఆమె సతమతమైంది. పెళ్లికి వెళ్తే దక్షేశ్ పటేల్ తనను ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడోనని తనలో తానే ఆవేదన చెందింది.ఈ నేపథ్యంలో 16 నుంచి 17వ తేది అర్ధరాత్రి వరకు చాటింగ్‌ ద్వారా మాటల యుద్దం నడిచింది. రెండు రోజుల వ్యవధిలో 320 కు పైగా మెసెజ్‌లు అనీషాచౌదరి ఫోన్‌లో నిక్షిప్తమై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మాటా మాటా పెరిగి తననే అనుమానిస్తున్నావా అంటూ .ప్రియుడు దీక్షేశ్‌ కు వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

హాస్టల్ గదిలోనూ ఆరోజు:

పైగా హాస్టల్ గదిలోనూ ఆరోజు అనీషా ఒక్కరే ఉండటం కూడా ఆమెను మరింత ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆమెతో పాటు ఉండే స్నేహితురాలు అంతకు ముందురోజే ఊరెళ్లడంతో గదిలో అనీషా ఒంటరిగా ఉంది. అదే క్రమంలో ఈ ఆలోచనలన్ని చుట్టుముట్టడంతో బాగా కుంగపోయింది. చివరకు అదే రోజు రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది.

Comments

comments

Share this post

scroll to top