పెళ్లి చేసుకొని కారులో ఊరేగితే ఏముందనుకున్నారో ఏమో ఈ జంట..Watch Video

ఒకప్పుడు పెళ్లంటే బ్యాండ్, బాజాలు, సన్నాయిలు లేనిది పెళ్లే కాదని అనేవాళ్ళు. రాను రాను అవి కనుమరుగైపోయి డిజేలు వచ్చాయి. మరి ఒకప్పుడు వధు, వరులను పెళ్ళైన తరువాత ఉరేగించడానికి గుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లు ఉపయోగించే వారు, అవి కూడా కాలంతో పోటీ పడలేక అదృశ్యమయ్యాయి. తరువాత కారులో వదు, వరులను ఉరేగిస్తున్నారు. అయితే ఖమ్మంలో ఓ జంట కొత్తగా, వింతగా ఆలోచించింది. అందరిలా చేస్తే మజా ఏముంటుందిలే అనుకున్నారో ఏమో ఏకంగా మట్టి తీసే జేసీబీ పైనే ఊరేగారు ఆ నవ వదు,వరులు కారుకి డెకరేషన్ చేసినట్టే బెలూన్లతో, పూలతో అందంగా డెకరేషన్ చేసి జేసీబీ ముందు మట్టి తీసే క్రేన్ పై కూర్చొని గల్లీ గల్లీ చక్కర్లు కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అప్పట్లో కూడా ఓ పెళ్లికి కాంక్రీట్ మిక్సింగ్ మిషన్ లో అన్నం, కూర, పప్పు మిక్స్ చేసి పెళ్లికి వచ్చిన అతిధులకు తాపీతో వడ్డించారు. ఇది చూసిన జనం అప్పట్లో ఆశ్చర్యానికి గురయ్యారు.

Comments

comments

Share this post

scroll to top