పెళ్లికి ఒప్పుకోలేదని టీచర్ ని హత్య చేసిన ప్రేమోన్మాది…

రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, చర్యలు చేపడుతున్న అబలలపై దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. మానవ మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. మొన్న హైద్రాబాద్ లో భరత్ అనే ప్రేమోన్మాది ప్రేమించలేదని ఇంటర్ అమ్మాయి మధులికను కొబ్బరిబొండాల కత్తితో అతి కిరాతకంగా దాడి చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.

తమిళనాడు లోని కడలూరు జిల్లాలో రమ్య అనే 23ఏళ్ల యువతి స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో మాథ్స్ టీచర్ గా పనిచేస్తుంది. రమ్య చదువుకునే రోజుల్లో రాజశేఖర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆరు నెలల కిందట రమ్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి రమ్యని తనకి ఇచ్చి పెళ్లి చేయాలని అడిగాడట రాజశేఖర్. దానికి వారు నిరాకరించడంతో రమ్యపై మరింత కక్ష పెంచుకున్నాడు.పాఠశాలకు దగ్గరలోనే రమ్య ఇల్లు ఉండటంతో రోజు తొందరగా స్కూల్ కి వచ్చేది. ఇదే అదనుగా భావించి ఆమెపై క్లాస్ రూంలోనే దాడికి పాల్పడి అతి కిరాతకంగా హత్య చేశాడు ప్రేమోన్మాది.

ఇదే అదునుగా చూసిన నిందితుడు ఆమెను అతి కిరాతకంగా హత్య చేసాడని అధికారులు తెలిపారు. పెళ్లి ప్రస్తావనను తిరస్కరించినందుకే ఆమెపై దాడికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాలేజీలో చదువుకునే సమయంలోనే నిందితుడికి ఆమె తెలుసని, ఆరు నెలల క్రితం బాధితురాలి తల్లిదండ్రుల వద్దకు రాజశేఖర్ వివాహ ప్రస్తావనను తీసుకురావడంతో వారు అందుకు సమ్మతించలేదు. పెళ్లికి నిరాకరించారనే కోపంతోనే నిందితుడు దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

.

Comments

comments

Share this post

scroll to top