మండపంలోనే వరుడికి షాకిచ్చిన వధువు, ట్విస్టిచ్చిన వరుడు, ఏం జరిగిందంటే?

ఆపండీ… మండపంలో పెళ్లి జరుగుతుంటే సరిగ్గా తాళి కట్టేముందు సినిమాల్లో మనకు వినపడే డైలాగ్…బేసిగ్గా కట్నం ఎక్కువ అడుగుతున్నారనో,అమ్మాయి వేరేవాళ్లని ప్రేమించిందనో,లేదంటే అబ్బాయి మోసగాడనో..పెళ్లిలో మగపెళ్లివారికి మర్యాదలు సరిగ్గా చేయలేదనో.. ఇలా రకరకాలుగా పెళ్లి ఆపిన ఘటనలున్నాయి.కాని అబ్బాయికి బట్టతల ఉందని పెళ్లి ఆపడం ఎప్పుడైనా విన్నారా.. పెళ్లికొడుకుకి బట్టతల ఉందనే కారణంతో పెళ్లి వద్దంది పెళ్లి కూతురు… అయినా పెళ్లి జరిగింది ఎలాగో తెలుసా??

న్యూఢిల్లీకి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్‌కు బీహర్‌లోని చంపారన్‌లోని సుగాలి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే చివరి నిమిషంలో యువతి డాక్టర్ రవికుమార్ ను వివాహం చేసుకొనేందుకు ఒప్పుకోలేదు. పెళ్ళి మండపంలోనే యువకుడితో వివాహనికి ఆ యువతి అంగీకరించలేదు. దీంతో వివాహన్ని అప్పటికప్పుడు రద్దు చేసుకొన్నారు. కానీ, అదే సమయానికి మరో యువతితో డాక్టర్ రవికుమార్ వివాహం జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

పెళ్ళి కొడుకు టోపీ తీసి పెళ్ళి మండపంలోకి రావడంతో , అతడికి జుట్టు లేదు..బట్టతల ఉందనే   విషయాన్ని వధువు గుర్తించింది. దీంతో పెళ్ళికి ఒప్పుకోలేదు.ససేమిరా వద్దంటే వద్దని పట్టుబట్టింది.  వధువు తల్లిదండ్రులు కూడ కూతురు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నారు. దీంతో ఆ వివాహం రద్దైంది. ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కాలేదు.దాంతో గ్రామ పెద్దలు అదే గ్రామానికి చెందిన మరో యువతితో డాక్టర్ రవికుమార్‌కు అదే ముహుర్తానికి వివాహం చేశారు. వివాహనికి హజరుకాని డాక్టర్ రవికుమార్ బంధువులు కొత్త దంపతులను చూసి ఆశ్చర్యపోయారు. నిశ్చితార్ధం రోజున వధువు స్థానంలో ఉన్న అమ్మాయి స్థానంలో మరో అమ్మాయి ఉండడాన్ని గుర్తించిన బంధువులు షాకయ్యారు.

Comments

comments

Share this post

scroll to top