పెళ్లిపీటలెక్కనున్న స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు “శృతిహాసన్”…? వరుడు ఎవరో తెలుసా..?

శృతిహాసన్…స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు..అయినప్పటికీ తనంతట తానుగా గుర్తింపు రావాలనుకున్నది..దానికోసం కష్టపడింది కూడా..మొదట్లో శృతిని అందరూ ఐరన్ లెగ్ అనేవారు..కానీ పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా శృతి ఫేట్ మార్చేసింది..ఎక్కడలేని క్రేజ్ ఆమె సొంతమైంది.టాప్ హీరోల సరసన అవకాశాలు తెచ్చిపెట్టింది..శృతికి సంభందించిన ఒక టాపిక్ ఇప్పుడు మీడియాలో ప్రచారం జరుగుతుంది..అదేంటంటే శృతి పెళ్లి విషయం..

స్టార్ హీరోల పెళ్లిల్లు అయిపోయాయి..హీరోయిన్స్ మాత్రం అవకాశాలు పోతాయని పెళ్లివైపు అంత త్వరగా మొగ్గుచూపరు.ఇటీవల సమంతా,నాగచైతన్యను పెళ్లిచేసుకోవడం..పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతానని చెప్పడం జరిగింది.ఇప్పుడు అదేబాటలో శృతి పయనిస్తుంది అనిపిస్తుంది…శ్రుతి లండన్‌కి చెందిన నటుడు మైఖేల్‌ కోర్సేల్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. చాలాసార్లు శ్రుతి.. మైఖేల్‌ను ముంబయికి కూడా తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు శ్రుతి ఆయనను తన తల్లి సారికకు పరిచయం చేశారట.మైఖేల్‌, శ్రుతి, సారిక కలిసి దిగిన ఫొటో సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇప్పటివరకూ  శ్రుతి తన ప్రేమ గురించి ఎప్పుడూ మీడియాకి నేరుగా చెప్పలేదు.తన పర్సనల్ విషయాలను అందరితో చెప్పుకోవడం తనకు నచ్చదని చెపుతూ..మరోపక్క పరోక్షంగా ప్రేమ విషయాన్ని చెప్పారు.ఇప్పటివరకూ తన లండన్ ప్రేమికుడు మైఖేల్ ఇండియా వచ్చినప్పుడల్లా ఆ ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టేవి ,వాటిని శృతి ఖండించిన దాఖలాలు కూడా లేవు..దాంతో శృతి తన ప్రేమ విషయం ఇండైరెక్ట్ గా చెప్పకనే  చెప్పింది.ఇప్పుడు మైఖేల్,శృతి ,సారిక ఫోటోలు లీక్ అవడంతో మైఖేల్‌ని తన తల్లికి పరిచయం చేశారు,త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Comments

comments

Share this post

scroll to top