12పెళ్లి చూపులు.. ఏ అమ్మాయి ఇష్టపడలేదు.! పక్కింటి అమ్మాయి కారణం అయ్యిందని ఆమె ఏం చేసాడో తెలుసా?

పెళ్లి అనేది జీవితంలో ఎవ‌రికైనా ఒక‌సారి మాత్ర‌మే వ‌చ్చే శుభ సంద‌ర్భం. కొంద‌రు రెండో, మూడు, నాలుగు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు లెండి. అది వేరే విష‌యం. అయితే ఎవ‌రికైనా ఆ శుభ ఘ‌డియ ఒక్క‌సారి మాత్రమే వ‌స్తుంది. కానీ కొంద‌రికి అస్సలు పెళ్లికాదు. ఓ వైపు ఏజ్ ద‌గ్గ‌ర ప‌డుతుంటుంది. కానీ ఎన్ని పెళ్లి చూపులు చూసినా సంబంధాలు కుద‌ర‌వు. దీంతో వారు మాన‌సికంగా కుంగిపోవ‌డం స‌హ‌జం. అయితే ఆ యువ‌కుడు మాత్రం మాన‌సికంగా కుంగిపోవ‌డం కాదు, రాక్ష‌సుడిలా ప్ర‌వ‌ర్తించాడు. తన‌కు పెళ్లి కాక‌పోవ‌డానికి ప‌క్కింటి అమ్మాయే కార‌ణ‌మ‌ని, ఆమె త‌న‌కు చేత‌బ‌డి చేయించింద‌ని న‌మ్మి అన‌వ‌స‌రంగా అభం శుభం తెలియ‌ని ఆ అమ్మాయిని పొట్ట‌న పెట్టుకున్నాడు. ఇంత‌కీ అసలు ఏం జ‌రిగిందంటే…

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మురేథి గ్రామంలో నివాసం ఉంటున్న పింటూకు పెళ్లి కావ‌డం లేదు. అత‌ను 12 పెళ్లి చూపులు చూశాడు. ఒక్క‌టి కూడా సెట్ అవ్వ‌లేదు. ఇక కొన్నిసార్లు అయితే ఎంగేజ్‌మెంట్ దాకా వ‌చ్చిన సంబంధాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో పింటు త‌న‌కు పెళ్లి కాక‌పోవ‌డానికి కార‌ణం ప‌క్కింట్లో ఉండే అమెరికా పటేల్ అనే యువ‌తేన‌ని అనుకున్నాడు. ఆమె త‌న‌పై చేత‌బ‌డి చేయించి ఉంటుంద‌ని న‌మ్మాడు. ఈ క్ర‌మంలో ఆమెను ఎలాగైనా అంత‌మొందించాల‌ని ప్లాన్ వేశాడు.

అలా ప్లాన్ వేసిన పింటు ఓరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అమెరికా పటేల్ పై దాడి చేశాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న స‌మయాన్ని చూసి ఆమెపై మొదట ఓ కర్రతో దాడి చేశాడు. అనంత‌రం పింటూ ఆమెను చున్నీతో ఉరివేశాడు. త‌రువాత ఆమె గొంతు నులిమి చంపేశాడు. అనంత‌రం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా ఆ యువ‌తిని పింటు చంపాడ‌ని తెలుసుకున్న పోలీసులు అత‌నిపై కేసు నమోదు చేసుకున్నారు. అనంత‌రం అత‌ని కోసం గాలింపు చేప‌ట్టారు. కాగా పింటు బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడని పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి సైకో చేతిలో ఆ యువ‌తి ప్రాణాలు పోగొట్టుకున్నందుకు అంద‌రం చింతించాల్సిందే. ఈ క‌ష్టం ఎవ‌రికీ రాకూడ‌దు.

Comments

comments

Share this post

scroll to top