పెళ్లికాని వారికి ఫేమస్ అయిన ఆ గుడిలో అనుష్క…ఎందుకు వెళ్ళిందో తెలుసా …!

ఒక అరుంధతి,ఒర రుధ్రమదేవి,ఒక దేవసేన,ఒక బాహుమతి ప్రతి పాత్రలో తనదైన శైలిలో ఒదిగిపోతూ..ఆ పాత్రల్ని తలుచుకోగానే కళ్లముందే తాను కాకుండా పాత్రలే మెదిలేలా నటించి మెప్పించిన నటి అనుష్క..తనకి నటనంటే తెలీదు,తను నటించే ప్రతి పాత్ర ద్వారా ఎప్పటికప్పుడు నటనలో ఓనమాలు నేర్చుకుంటుంటా అని చెప్పే ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు తన పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్తుందా అని ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు..ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని దాటేస్తున్నప్పటికి అనుష్క పెళ్లిపీటలెక్కాలనుకుంటుంది..అందుకే ఆ గుడికి వెళ్లింది అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఇంతకీ ఏ గుడికి వెళ్లింది..ఎందుకు వెళ్లింది…

ఇటీవల  అనుష్క  కేదార్‌నాథ్‌లో కొలువైన మహాశివుణ్ణి దర్శించుకుంది. . ఇద్దరు సభ్యులతో అనుష్క కాలిబాటన ధామానికి చేరుకుంది .కేదారేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించిన విషయం చాలా గుట్టుగా ఉంచాలనుకుంది అనుష్క.అందుకే ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు..కాని   యాత్రలో ఉన్న కొందరు ఆమెను గుర్తించి ఫొటోలు తీసుకున్నారు. అయితే దీనికి ఆమెతో పాటు వచ్చినవారు అభ్యంతరం తెలపడం… ఆ యాత్ర ఫొటోలు,అనుష్క కేదార్ నాద్ యాత్ర విషయాలు బయటికి రావడంతో కొత్త చర్చ మొదలైంది. అదే ఆమె పెళ్ళి గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది.

ఛార్ ధామ్ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన కేదార్ నాథ్ లో అతి పురాతనమైన శివలింగం ఉంది. ఈ ఆలయంలో పెళ్లికాని వారు పూజలు చేస్తే త్వరగా పెళ్లయిపోతుందని భక్తులు నమ్ముతారు.. పెళ్లికి అడ్డంకులు తొలగిపోయేందుకే స్వీటీ ఈ గుళ్లో ప్రత్యేకంగా పూజలు చేసినట్టు భావిస్తున్నారు. త్వరలోనే ఆమె నుంచి ఓ గుడ్ న్యూస్ రాబోతుందని, అందుకే ముందుగా కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించిందని అంటున్నారు.అనుష్క ,ప్రభాస్ మధ్య ప్రేమాయణం నడిచిందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి..వీటిని అటు ప్రభాస్ ,ఇటు అనుష్క ఇద్దరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో వారి మధ్య నిజంగా ప్రేముందా లేదా అనే విషయం ఎవరికి అర్దం కాని విషయంగా మిగిలిపోయింది. ఇప్పుడు అనుష్క పూజలు ప్రభాస్ కోసమా..లేకపోతే మరెవరైనా ఉన్నారా అనే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి..

Comments

comments

Share this post

scroll to top