ఓ వయస్సుకంటూ వచ్చాక ఆడ, మగ శృంగారంలో పాల్గొంటారు. అది వారి ఇష్టపూర్వకంగా జరగవచ్చు, లేదంటే విరుద్ధంగా జరగవచ్చు. అది వేరే విషయం. అయితే ఆడ, మగ శృంగారంలో పాల్గొనే విషయానికి వస్తే ఆ పని చేయడం కోసం పెళ్లి చేసుకోవాల్సిన పనిలేదు. ఇష్టం ఉంటే సెక్స్‌లో పాల్గొంటారు. ఇప్పుడు కొందరు చేస్తుందదే. అయితే నిజానికి ఇలా పెళ్లి కాక ముందే సెక్స్‌లో పాల్గొనడం అనేది కొన్ని దేశాల్లో ఎవరికి వారు తమ ఇష్టపూర్వకంగానే చేస్తున్నా దానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండడం లేదు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం ఇలా చేయడం అక్కడి ప్రభుత్వాలు నేరంగా పరిగణిస్తాయి. ఇండోనేషియా కూడా అలాంటి దేశాల్లో ఒకటి.
అక్కడి చట్టాలు ఇలాంటి విషయాల పట్ల చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ముస్లిం మెజారిటీ కంట్రీ అయిన ఇండోనేషియాలో ఇస్లామిక్ షరియా న్యాయాన్ని కచ్చితంగా అమలు చేస్తారు. కాగా ఇటీవలే అక్కడి ఓ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు (ఆడ, మగ) శృంగారంలో పాల్గొన్నారు. వారికి పెళ్లి కాలేదు కాబట్టి అక్కడ అలా చేయడం చట్టరీత్యానే కాదు, వారి సాంప్రదాయం ప్రకారమూ నేరమే. ఈ క్రమంలో సదరు విద్యార్థులకు అక్కడి న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధించిందో తెలుసా..? కొరడా దెబ్బలు..!
ఇండోనేషియాలోని బాందా అకే అనే ఓ మసీదు ప్రాంగణంలో సదరు విద్యార్థులిద్దరికీ కొరడా శిక్ష అమలు చేశారు. ముందుగా విద్యార్థినిని మోకాళ్లపై కూర్చోబెట్టి ఆమె వీపు మీద మాస్క్ ధరించిన ఓ వ్యక్తి కొరడాతో కొన్ని దెబ్బలు కొట్టాడు. అనంతరం విద్యార్థిని పిలిచి ఈ సారి అతన్ని నిలబెట్టి అదే శిక్షను అమలు చేశారు. అంత కఠినంగా ఉంటాయి అక్కడి శిక్షలు. అయితే ఇండోనేషియాలో ఇలాంటి శిక్షలు విధించడం కొత్తేమీ కాదు. అక్కడ ఇలాంటివే కొన్ని అమలులో ఉన్నాయి. అయితే అవి శిక్షలు కాదు, నియమాలు..!
- ఇండోనేషియాలో రాత్రి 11 దాటిందంటే చాలు మహిళలెవరూ సినిమాలకు, వినోదాలకు వెళ్లకూడదు. ఒక వేళ వెళ్తే ఆమెతోపాటుగా భర్త లేదా కుటుంబ సభ్యుల్లో అన్నో, తమ్ముడో, నాన్నో తోడు ఉండాలి.
- పెళ్లి కాని స్త్రీ, పురుషులు ఇద్దరూ కలసి తిరగకూడదు. ముఖ్యంగా బైక్‌లపై వెళ్లరాదు.
- ఇలాంటివే నియమాలు ఇంకా కొన్ని ఇండోనేషియాలో అమలులో ఉన్నాయి.