పెళ్లి చూడటానికని వచ్చింది…కానీ ఆమె చివరికి పెళ్లికూతురైంది..! అసలేమైందో తెలుసా..?

పెళ్లి అనేది జీవితంలో ఒకేఒకసారి వచ్చే మధురమైన ఘట్టం.దానికోసం పెళ్లి చూపుల దగ్గరనుండి నిశ్చితార్ధం పెళ్లి వరకూ అనేక ప్లానింగులు ఉంటాయి..పెళ్లికూతురు వైపు అయితే ఆ హడావిడి మరింత ఎక్కువగా  ఉంటుంది..కానీ ఏ హడావిడి లేకుండా ఒక అమ్మాయి పెళ్లి జరిగిపోయింది.అది కూడా వేరే వాళ్ల పెళ్లి చూడ్డానికి  వెళ్లిన ఈ అమ్మాయికి అక్కడే పెళ్లి అయిపోయింది..అందుకే పెద్దలు ఊరికే అనలేదు కళ్యాణం వచ్చినా ,కక్కోచ్చిన్నా ఆగదని…

తమిళనాడులోని తిరుచ్చిలో తెలిసిన వాళ్ల పెళ్లికి వెళ్లింది ఒక యువతి..అందరు బందువుల్లానే తను కూడా పెళ్లిలో చుట్టాలు పక్కాలతో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తుంది.పెళ్లి కాగానే నాలుగు అక్షింతలు వేసి భోజనం చేసి మళ్లీ తిరిగివెళ్లడమే తన కళ్లల్లో కదులుతున్న ఊహ,మైండ్లో నడుస్తున్న ఆలోచనలు..కానీ మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది.ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియకుండా మలుపు తిరగడమే జీవితం.పెళ్లి చూసేందుకు వెళ్లిన ఓ యువతి ఊహించని విధంగా పెళ్లికూతురైంది. తురైయూరులోని కాయగూరల మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్న వెంకటేశన్‌కు మన్నసనల్లూరుకు చెందిన కనకతో నిశ్చితార్థం జరిగింది. ముహూర్తం ప్రకారం వీరి వివాహానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. సరిగ్గా వధువు మెడలో వెంకటేశన్‌ తాళి కడుతుండగానే  పోలీసులు వచ్చి ఆపండీ అని ఒక డైలాగ్..ఎన్ని తెలుగు సినిమాల్లో చూల్లేదు..ఏదో వెధవ పని చేసాడు పెళ్లి ఆపేసారు.

అలాంటప్పుడు ఇంకో అబ్బాయిని చూసి అమ్మాయికి పెళ్లి చేయాలి కానీ,వేరే అమ్మాయినిచ్చి చేయడమేంటి అనుకుంటున్నారా..ఇక్కడ పెళ్లి కొడుకు తప్పే చేసాడు.మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం..అందుకే పోలీసులు వచ్చారు పెళ్లి ఆపడానికి..ఏం చేయాలో పాలు పోని స్థితిలో పెళ్లి మండపంలోని ఎవరైనా ఒక యువతిని అతడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు.అంతే పెళ్లి కొచ్చిన ఈ యువతిని తన అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుని ముహూర్తం టైం కి పెళ్లి చేసేశారు..అదండీ మ్యాటర్..

Comments

comments

Share this post

scroll to top