వాళ్ళు పెళ్లి చేసుకుంటే మూడు రోజులు టాయిలెట్ కు వెళ్ళకూడదు అంట..! వెళ్తే ఏమవుతుందో తెలుసా?

మ్యారెజెస్  ఆర్ మేడిన్ హెవెన్ అంటారు…ఒక అమ్మాయి ,అబ్బాయి ఒకటవుతూ చేసుకునే ముచ్చట పెళ్లి..అనాధిగా వస్తున్న సంప్రదాయం..కాలం మారుతున్న కొద్దీ.. ఆచారాలు, పద్ధతులు మారి రకరకాల స్టైల్స్ లో పెళ్లి చేసుకుంటున్నారు. ఏ స్టైల్లో చేసుకున్నా.. అమ్మాయి, అబ్బాయితోనే మూడుముళ్ల బంధం పడుతోంది..ప్రేమ పెళ్లిళ్లు,పెద్దలు కుదిర్చిన పెళ్లిల్లే కాకుండా అనేక వింత పెళ్లిల్ల గురించి కూడా విన్నాం….వింత ఆచారాలలో ఒకటే పెళ్లయన జంటని టాయిలెట్ కి దూరంగా ఉంచడం..ఎక్కడో చూడండి..

విచిత్రమైన పెళ్లిళ్ల గురించి మనం ఇంతకుముందు చదివినా ..ఈ అత్యంత విచిత్రమైన వివాహ శైలి ఎవరూ కనని, వినని రీతిలో ఉంటుంది.ఇండోనేషియాలో టాంగ్డా వర్గానికి చెందిన ప్రజల వివాహ వేడుక అని  ముక్కున వేలేసుకుంటారు..   టాంగ్డా జాతిలో పెళ్లయిన తరువాత కొత్త జంటకు మూడు రోజుల వరకూ టాయిలెట్‌కు వెళ్లేందుకు పెద్దలు అనుమతినివ్వరు. వినడానికి ఇది వింతగానే ఉన్నా ఈ సాంప్రదాయన్ని   ఇంకా కొనసాగిస్తున్నారు. పెళ్లయిన తరువాత మూడు రోజులలోగా కొత్తజంట టాయిలెట్‌కు వెళితే.. అది వారి అదృష్టాన్ని దెబ్బతీస్తుందని వారు నమ్ముతారు. ఇలాచేస్తే వారి వివాహ బంధం కలకాలం నిలవదని, మధ్యలోనే ఎవరో ఒకరు మరణిస్తారని కారణం చెప్తున్నారు.. అందుకే అక్కడ పెళ్లయిన కొత్త జంట మూడు రోజుల పాటు కొద్ది మోతాదులోనే ఆహారం తీసుకుంటుంది. ఈ మూడు రోజుల తరువాతే పెళ్లి కుమారుడు, కుమార్తె స్నానంచేసి, తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు…

 

Comments

comments

Share this post

scroll to top