మాజీ క్రికెట్ ప్లేయ‌ర్ జ‌హీర్‌ఖాన్ పెళ్లి చేసుకున్న సాగ‌రిక ఘాట్గేకు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విషయాలు ఇవే తెలుసా..?

చ‌క్‌దే ఇండియా సినిమా గుర్తుంది క‌దా. 2007వ సంవత్సరంలో ఆ సినిమా రిలీజ్ అయింది. బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ అందులో హాకీ కోచ్‌గా న‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ అయింది. అయితే అందులో న‌టించిన సాగ‌రిక ఘాట్గే అనే న‌టి తెలుసు క‌దా. అదేనండీ.. ఆమెను ఈ మ‌ధ్యే టీమిండియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్ జ‌హీర్‌ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, తెలుసు క‌దా. అవును.. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా సాగ‌రిక ఘాట్గే గురించే. ఆమెకు చెందిన ప‌లు విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం..!

జ‌హీర్‌ఖాన్‌, సాగ‌రిక ఘాట్గే ల వివాహం అంద‌రి పెళ్లిళ్ల‌కు భిన్నంగా కోర్టు హాల్‌లో జ‌రిగింది. అయితే అందుకు కార‌ణాలు ఏమై ఉంటాయోన‌నే విష‌యం మాత్రం బ‌య‌టికి రాలేదు. బ‌హుశా జ‌హీర్‌ఖాన్ లేదా సాగ‌రిక ఘాట్గే త‌ర‌ఫు కుటుంబ స‌భ్యుల‌కు ఈ పెళ్లి న‌చ్చ‌క‌పోయి ఉండ‌వ‌చ్చు. దాంతో ఆ వ‌ర్గం వారు ఎవ‌రైనా ఏదైనా చేస్తారేమోన‌ని అంద‌రి మ‌ధ్య కోర్టు హాల్‌లో పెళ్లి చేసుకుని ఉండ‌వ‌చ్చు.. అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక సాగ‌రిక ఘాట్గే చ‌క్ దే ఇండియా సినిమాలో హాకీ ప్లేయ‌ర్ క్యారెక్ట‌ర్‌లో న‌టించింది. కానీ మీకు తెలుసా..? నిజంగా సాగ‌రిక ఘాట్గే హాకీ ప్లేయరే. ఆమె ప‌లు జాతీయ మ్యాచ్‌ల‌ను కూడా ఆడింది. అనుకోకుండా చ‌క్ దే ఇండియాలో ఆమెకు చాన్స్ వ‌చ్చింది. అందులో న‌టించాక ఆఫ‌ర్లు ఆమెను వెదుక్కుంటూ వ‌చ్చాయి.

సాగ‌రిక ఘాట్గేకు కాలేజీలో ఉన్న‌ప్పుడే సినిమా అవ‌కాశాలు పుష్క‌లంగా వ‌చ్చాయి. కానీ తండ్రి గ్రాడ్యుయేష‌న్ చేసేదాక న‌ట‌న‌కు దూరంగా ఉండ‌మ‌ని చెప్ప‌డంతో ఆమె చ‌దువు కోసం సినీ రంగంలోకి లేటుగా వ‌చ్చింది. అయినా న‌టిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకుంది. ఇక ఈమె క‌గ‌ల్ అన‌బ‌డే రాజ కుటుంబానికి చెందుతుంది. సాగ‌రిక బామ్మ ఇండోర్ మ‌హారాజు టుకోజీ రావు III కి కూతురు అవుతుంది. అలా ఆమెది రాజ వంశం అయింది. విజ‌యేంద్ర ఘాట్గే అనే వ్య‌క్తి ప‌లు టీవీ షోల ద్వారా పాపుల‌ర్ అయ్యారు. ఈయ‌న సాగ‌రిక ఘాట్గేకు బంధువు అవుతారు. ఇవీ… సాగ‌రిక ఘాట్గే గురించిన విష‌యాలు..!

Comments

comments

Share this post

scroll to top