పిల్ల‌లు లేని వారికి …పెద్ద కాకాని.! మండ‌ల దీక్ష చేస్తే క‌లుగును సంతానం !

గుంటూరు కు 9 కిలోమీట‌ర్ల దూరంలో కొలువైన శ్రీ భ్ర‌మ‌రాంభ‌స‌మేత మ‌ల్లేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకొని… సంతానం లేని వారు అక్క‌డ 40 రోజుల పాటు మండ‌ల దీక్ష చేసి…దేవాల‌యానికి ఈశాన్య దిశ‌లో ఉన్న రావి+ వేప చెట్టు క‌లిసిపోయిన ప్రాంతం చుట్టూ రోజూ 108 ప్ర‌దిక్ష‌ణ‌లు చేస్తే వారికి సంతానం క‌ల్గుతుంద‌ట‌! ఇలా చేసి సంతానాన్ని పొందిన వారి వివ‌రాలు కూడా అక్క‌డ గుడిలో న‌మోదై ఉన్నాయట‌.!

స్థ‌ల పురాణం:

పూర్వం ఓ ముని ఓ స్థ‌లంలో య‌జ్ఞం చేస్తూ….అగ్నికి నెయ్యిని స‌మ‌ర్పిస్తున్న స‌మ‌యంలో…ఓ కాకి వ‌చ్చి దానిని స్వీక‌రించేద‌ట‌.! అలా చేస్తున్న క్ర‌మంలో ఆ ముని ఇత‌ర మునుల‌తో…ఇదేంటి ఇలా..? అని చ‌ర్చించుకుంటున్న త‌రుణంలో..ఆ కాకి మ‌నుష్య శ‌బ్దంతో…నేను కూడా మునినే..ఓ శాపం వ‌ల్ల ఇలా కాకిగా మారాను…మీరు చేసే య‌జ్ఞం కంటే ప‌విత్ర నీటితో న‌న్ను అభిషేకిస్తే నాకు పూర్వ రూపం వ‌స్తుంది, మీకు య‌జ్ఞాన్ని మించిన ఫ‌లితం ద‌క్కుతుంది అని చెప్ప‌డంతో..ఆ ముని కాకి చెప్పిన‌ట్టు చేసి…ఆ కాకికి పూర్వ రూపం పొంద‌డంలో స‌హాయ‌ప‌డ‌తాడ‌ట‌.! అలా…ఆ ప్రాంతానికి కాకా( కాకి)…కాకా…కాకా…అని…అదే కాకాని గా స్థిర‌ప‌డింద‌ని స్థ‌ల‌పురాణం.

For More Details:   CLICK

 

Comments

comments

Share this post

scroll to top