నిత్యం గుప్పెడు వేరుశెన‌గ‌లు (ప‌ల్లీలు) తింటే క‌లిగే 8 అద్భుత‌మైన ప్రయోజ‌నాలు ఇవే..!

వేరుశెన‌గ‌లు… వీటినే కొంద‌రు కొన్ని ప్రాంతాల్లో ప‌ల్లీలు అని కూడా అంటారు. ఇంగ్లిష్ లో పీన‌ట్స్ అంటారు. అయితే ఎలా పిలిచినా వీటి వ‌ల్ల మ‌న‌కు లాభాలే క‌లుగుతాయి. ఎందుకంటే ప‌ల్లీల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోషకాలు ఉంటాయి. పొటాషియం, ఫైబ‌ర్‌, కాల్షియం, ఐర‌న్‌, విట‌మిన్ బి6, మెగ్నిషియం వంటి న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎంతో అవ‌స‌రం. అంతేకాకుండా మ‌న ఆరోగ్యాన్ని కాపాడే శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అయితే ఇవి మ‌న‌కు హాని క‌లిగించ‌వు. ఎందుకంటే ఈ కొవ్వులు మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. ప‌ల్లీల‌ను తింటే కొవ్వు చేరుతుంద‌ని కొంద‌రు అపోహ‌కు లోన‌వుతారు. కానీ అది నిజం కాదు. ఎవ‌రైనా రోజూ గుప్పెడు ప‌ల్లీల‌ను తింటే చాలు, దాంతో కింద చెప్పిన లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే…

1. రోజూ కొద్దిగా పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ త‌గ్గుతుంది. పల్లీలలో ఉండే ఫాలీ ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్స్ గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి. కార్సినోజెనిక్ ప‌దార్థాల‌ను శ‌రీరం నుంచి తొలగిస్తాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది.

2. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వీటిలో ఉండే మోనో అన్ శాచురేటుడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో అధిక బ‌రువు తగ్గుతారు. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

3. ప‌ల్లీల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో విట‌మిన్ బి3 శ‌రీరానికి బాగా ల‌భిస్తుంది. ఇది మెద‌డు చురుగ్గా ఉండేలా చేస్తుంది. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతుంది. ముఖ్యంగా పిల్ల‌ల‌కు రోజూ ఒక గుప్పెడు ప‌ల్లీల‌ను తినిపించ‌డం మంచిది. దీంతో వారు చ‌దువుల్లో బాగా రాణిస్తారు.

4. ప‌ల్లీల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి సెర‌టోనిన్‌ను ఎక్కువగా ఉత్ప‌త్తి చేస్తాయి. దీంతో డిప్రెష‌న్, ఒత్తిడి, ఆందోళ‌న వంటివి త‌గ్గుతాయి.

5. రోజూ వేరుశెన‌గ‌ల‌ను తింటూ ఉంటే గాల్ స్టోన్స్ వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది. 25 శాతం వ‌ర‌కు ఆ రిస్క్ త‌గ్గుతుందని అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి.

6. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా ఉంటుంది. దీంతో వృద్ధాప్యంలోనూ మెమొరీ ప‌వ‌ర్ బాగా ఉంటుంది.

7. గ‌ర్భిణీలకు వేరుశెన‌గ చేసే మేలు అంతా ఇంతా కాదు. గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు రోజూ ప‌ల్లీల‌ను తింటూ ఉంటే దాంతో ఫోలిక్ యాసిడ్ వారికి ఎక్కువ‌గా అందుతుంది. దీని వ‌ల్ల బిడ్డ ఎదుగుద‌ల స‌క్ర‌మంగా ఉంటుంది.

8. రోజుకు గుప్పెడు ప‌ల్లీల‌ను తింటే శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు క్ర‌మంగా పెరుగుతాయి. ఎక్కువ సేపు ప‌నిచేసినా అల‌సిపోరు. దీనికి తోడు రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top