టీమిండియా క్రికెటర్లకు జీతాలను భారీగా పెంచారు. ఎంతో తెలుసా..?

క్రికెట్‌ ఆటగాళ్లు అంటే.. వారికి ఏ రేంజ్‌లో సౌకర్యాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా భారత క్రికెటర్లకు అయితే విలాసవంతమైన జీవితం ఉంటుంది. వారికి అధికారికంగా ఇచ్చే మ్యాచ్‌ ఫీజులకు తోడు వారు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా పనిచేస్తారు. యాడ్స్‌ చేస్తారు. దీంతో ఇంకా ఎక్కువ మొత్తం డబ్బును సంపాదిస్తారు. అయితే మన క్రికెటర్ల జీతాలను మాత్రం ఇప్పుడు బీసీసీఐ బాగా పెంచేసింది. మరి పెంచిన జీతాల ప్రకారం ఎవరెవరికి ఎంత మొత్తం డబ్బు అందుతుందో ఇప్పుడు తెలుసుకుందామా..!

భారత క్రికెటర్లను బీసీసీఐ 3 కేటగిరిలుగా విభజించి వారికి జీతాలను అందిస్తోంది. ఎ, బి, సి అని కేటగిరిల్లో క్రీడాకారులను ఎంపిక చేస్తారు. వారి ఆటతీరు, నైపుణ్యాన్ని బట్టి వారిని ఆయా కేటగిరిల్లో చేర్చుతారు. ఇక వీరి జీతాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎంత పెరిగాయో చూద్దాం.

ఎ కేటగిరి – విరాట్‌ కోహ్లి, మహేంద్ర సింగ్‌ ధోనీ, రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్యా రహానే, చెటేశ్వర్‌ పుజారా, రవీంద్ర జడేజా, మురళీ విజయ్‌లు ఈ కేటగిరిలో ఉన్నారు. వీరికి ఒకప్పుడు రూ.2 కోట్ల వేతనం ఇచ్చారు. అయితే దాన్ని ఇప్పుడు అమాంతం రూ.12 కోట్లకు పెంచారు. ఇక టీమిండియా కెప్టెన్‌ కోహ్లికి మాత్రం ఇంత కన్నా ఎక్కువే అందుతుంది. ఎందుకంటే అతను కెప్టెన్‌ కదా.

బి కేటగిరి – కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ, ఉమేష్‌ యాదవ్‌, ఇశాంత్‌ శర్మ, వృద్ధిమాన్‌ సాహా, జస్‌ప్రిత్‌ బుమ్రా, యువరాజ్‌ సింగ్‌లు ఈ కేటగిరిలో ఉన్నారు. వీరికి మొన్నటి వరకు రూ.1 కోటి వేతనం ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.8 కోట్లు చేశారు.

సి కేటగిరి – శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, అమిత్‌ మిశ్రా, మనీష్‌ పాండే, అక్షర్‌ పటేల్‌, కరుణ్‌ నాయర్‌, హార్దిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్‌, యుజ్‌వేంద్ర చాహల్‌లు ఈ కేటగిరిలో ఉన్నారు. వీరికి ఇప్పటి వరకు రూ.50 లక్షల వేతనం ఏడాదికి గాను అందేది. అది పెరగడంతో ఇప్పుడు వీరికి జీతం రూ.4 కోట్ల వరకు ఇవ్వనున్నారు. పెంచిన జీతాలను ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top