“బొంబాయిలో అంతే…బొంబాయిలో అంతే”.! సంచలన ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్! అసలేమైంది?

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారంటూ ప‌లు టీవీ చానెల్స్‌పై ఆయ‌న ట్వీట్ల యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు చానల్స్‌కు, వాటిలో ప‌నిచేస్తున్న ప‌లు విభాగాధిప‌తుల‌కు, షేర్ హోల్డ‌ర్ల‌కు, పెట్టుబ‌డిదారుల‌కు లీగ‌ల్ నోటీసులు పంప‌నున్న‌ట్లు ప‌వ‌న్ ట్వీట్ చేసి బాంబు పేల్చారు. ఇక దాంతోపాటు ఓ ప్ర‌ముఖ టీవీ చాన‌ల్‌, ప‌త్రిక ఎండీని టార్గెట్‌గా చేసి కూడా ప‌వ‌న్ ట్వీట్లు పెడుతున్నారు. ఈ మ‌ధ్యే స‌ద‌రు ప‌త్రిక ఎండీ ప‌వ‌న్‌పై త‌మ ప‌త్రిక‌లో ఓ కాల‌మ్ రాయ‌గా, అందులో ప‌వ‌న్‌ను తీవ్రంగా విమ‌ర్శించారు. అయితే ప‌వ‌న్ ఆ కాల‌మ్‌పై స్పందించారు.

స‌ద‌రు కాల‌మ్ రాసిన ప‌త్రిక ఎండీని విమ‌ర్శిస్తూ ప‌వ‌న్ తాజాగా ట్వీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే తిట్టు పల్లెటూళ్లో చాలా సర్వసాధారణం అని బూతురత్నం అంటున్నాడంటూ…అందుకు ఒక సినిమాలో కమెడియన్ బొంబాయిలో అంతే అనే మేనరిజాన్ని వాడిన తీరును పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ఓ పార్టీకి మద్దతు ఇస్తున్న ప‌లు టీవీ ఛానెళ్లపై యుద్ధం ప్రకటించిన అనంత‌రం వ‌రుస‌గా ట్వీట్లను సంధిస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్ప‌టికీ అదే పంథాను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆ ఛానెళ్లకు సంబంధించిన ప‌లువురు ముఖ్యులైన వారందరిపై న్యాయ పోరాటం చేయనున్నట్లు ప‌వ‌న్‌ ప్రకటించారు. అనంత‌రం కొద్ది గంటల విరామంతోనే ప‌వ‌న్‌ తాజాగా మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఆయన నేరుగా పేర్లు, వివరాలు ప్రస్తావించకుండా పరోక్షంగా ఒక పత్రిక, మీడియా ఛానెల్ నడిపే ఎండీని లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యంగా ఉన్న కామెంట్ల‌తో ఆ ట్వీట్ ను పోస్ట్ చేశారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట్ చేసిన ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ఇటీవల ఓ పత్రిక యజమాని తాను రాసిన కాలమ్ లో పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన తిట్టు పల్లెటూళ్లలో సర్వసాధారణంగా వాడతారని, అది ప్రత్యేకించి పట్టించుకోవాల్సినంత అవసరం లేదనే విధంగా రాసిన విషయాన్ని పరోక్షంగా ఉదహరిస్తూ పవన్ కళ్యాణ్ త‌న ట్వీట్‌ లో వ్యంగాస్త్రాలు సంధించారు. ఒక సినిమాలో విలన్లు ఎలాంటి తప్పుడు పనులు చేసినా ఏంటిదని ఎవరైనా అడిగితే ఆ పక్కనున్న కమెడియన్ పాత్ర బొంబాయిలో అంతే… బొంబాయిలో అంతే.. అని అంటాడ‌ని, అలాగే ఈ బూతురత్నం కూడా పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే తిట్టు పల్లెటూళ్లలో చాలా సాధారణం అంటున్నాడు…క‌నుక ఈ లాజిక్ ను బట్టి ఇతనిని ప్రజలందరూ అలా పిలిచినా తప్పు అని ఏమీ అనుకోడని, కాబట్టి మీరు స్వేచ్ఛ‌గా బూతురత్నని అలా పిలుచుకోవచ్చని ప‌వ‌న్ ఎద్దేవా చేశారు. దీంతో ప‌వ‌న్ చేసిన ఆ ట్వీట్ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది. బూతురత్న లాజిక్ ప్రకారం మీరు స్వేచ్చగా అలా పిలుచుకుంటే అతడు బాధపడడని… నవ్వుకుంటూ.. పల్లెటూళ్లలో అంతే…పల్లెటూళ్లలో అంతే…అనుకుంటూ బూతుపలుకు రాస్తూ కూర్చుంటాడని పవన్ కల్యాణ్ వ్యంగాస్త్రం సంధించారు. అయితే అతను ఇచ్చిన లైసెన్స్ అతని వరకే పరిమితమవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి అని ప‌వ‌న్ ట్వీట్‌లో పెట్టారు.

అయితే ప‌వన్ క‌ల్యాణ్ చేసిన ఈ ట్వీట్‌ను బ‌ట్టి చూస్తే ఆయ‌న ట్వీట్ల‌తోనే ఆ పార్టీ, దానికి మ‌ద్ద‌తు ఇచ్చే చాన‌ల్స్‌పై యుద్ధం చేస్తున్న‌ట్లు మ‌న‌కు క‌నిపిస్తుంది. మ‌రి చివ‌ర‌కు ఇది ఎక్క‌డి వ‌రకు వెళ్తుందో తెలియ‌దు కానీ… ఓ వైపు ప‌వ‌న్ అభిమానులు మాత్రం ఆయ‌న చేస్తున్న ట్వీట్ల‌తో ఓ ర‌క‌మైన సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Comments

comments

Share this post

scroll to top