పవన్ కళ్యాణ్ పై గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడి…! తర్వాత పవన్ ఏం చేసారో తెలుసా.? [VIDEO]

 జనసేన అధినేత,పవర్ స్టార్  పవన్ కల్యాణ్‌పైకి గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు.పవన్ తన పర్యటనను  కరీంనగర్ జిల్లా కొండగట్టు నుండి ప్రారంభించిన విషయంతెలిసిందే..నాలుగు రోజులపాటు మూడు జిల్లాల్లో పర్యటించనున్న పవన్ పై ఖమ్మంలో గుర్తు తెలియని వ్యక్తి చెప్పుతో దాడిచేశాడు. ఓపెన్‌టాప్ వెహికల్‌లో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్న పవన్ పై ఇలా చేయడం సంచలనంగా మారింది.   అయితే అదృష్టవశాత్తూ అది కారు బ్యానెట్‌పై పడడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకుగా…అనంతరం కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ దీనిపైనే స్పందించారు..
ఖమ్మంలో పర్యటిస్తున్న పవన్ తల్లాడా సెంటర్ కి రాగానే అభిమానులు,కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడారు..ఆ జన సమూహం అంతా పవన్ ని ఉద్దేశించి జైజై నినాదాలతో హోరెత్తిస్తుంటే..అందులో నుండే  ఒకరు పవన్ పై దాడి చేశాడు..ఈ ఘటన జరిగిన తర్వాత  ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్‌ సమావేశమయ్యారు.
ఆ సమావేశంలో పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను. ప్రజల కోసం ఏమైనా భరిస్తా. మహనీయుల ఆశయాల కోసం బాధ్యతాయుత రాజకీయాలు చేయాలి. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. నాకు కులం, మతం లేదు. మానవత్వం, జాతీయతను గౌరవిస్తా. మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉంది. కులవ్యవస్థను కాదని రాజకీయాలను చేయలేము. మెత్తగా మాట్లాడతానని కొందరు అనుకోవచ్చు. వ్యూహంలో భాగంగానే కొద్దిగా తగ్గుతాను. ఎన్నికల్లో సీట్లు ఇస్తేనే సామాజిక న్యాయం జరగదు. తమ కులం అభివృద్ధి చెందకపోవడంపై నేతలు ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామని చెప్పడం లేదు. కార్యకర్తలు సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు తెలుసుకోవాలి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య నన్ను కదిలించింది. ప్రజలకు అండగా నిలబడితే ఎందుకు విమర్శలు చేస్తారో తెలియదు. ఇంతకాలం ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు? జనసేన కార్యకర్తలు స్థానిక సమస్యలను వెలుగులోకి తేవాలి. సమస్యలపై అధికారపక్షాలను నిలదీయడమంటే తిట్టడం కాదు.. నా జీవితం జనసేన కార్యకర్తలకు అంకితం. నేను పదవులు కాదు..సామాజిక మార్పు కోరుకుంటున్నా. ప్రేమించేవాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను’’ అని అన్నారు.

 watch video here:

Comments

comments

Share this post

scroll to top