తనపై వచ్చే విమర్శలపై “జనసేన పవన్ కళ్యాణ్” ఏమని లేఖ రాసారో తెలుసా.? పరోక్షంగా “రేణు” కి కౌంటర్.?

జనసేన పార్టీ శ్రేణులకు ,అభిమానులకు విన్నపం అంటూ నిన్న జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాసిన ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మనపై వచ్చే విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదంటూ పిలుపునిచ్చాడు..అందులో పవన్ వాడిన కువిమర్శలు అనే పదం ఇప్పటికే కొందరికి కోపం తెప్పిస్తుంటే..మరోవైపు ఈ మాటలు ఇండైరెక్ట్ గా రేణు దేశాయ్ ని ఉద్దేశించా అనే అనుమానం వ్యక్తమవుతుంది..

రేణు దేశాయ్..పవన్ తో సినిమాలు, సహజీవనం,పెళ్లి,విడాకులు..తర్వాత తన పిల్లలతో తను జీవితం గడుపుతుంది.రేణుకి భర్త గా ఉండనప్పటికి,పిల్లలకు మాత్రం తండ్రి బాద్యతలు చూసుకుంటున్నారు పవన్.రేణుతో విడాకుల తర్వాత పవన్ ఆస్ట్రేలియన్ ని పెళ్లి చేసుకున్నారు..రేణు మాత్రం గత ఏడేళ్లుగా ఒంటరిగా ఉంటుంది.ఇటీవల మళ్లీ ఒక ప్రోగ్రం కి జడ్జ్ గా వ్యవహరిస్తూ బుల్లితెరపై దర్శనమిచ్చింది.ఆ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఒక తోడుంటే బాగున్ను అనిపిస్తుంది అనే వ్యాక్యలు పెద్ద దుమారమే రేపాయి.ఆ మాటలకు పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రేణు కి వ్యతిరేఖంగా కామెంట్స్ చేశారు.వాటిని కూడా రేణు తిప్పి కొట్టింది..కానీ సడన్ గా నెక్ట్స్ డే నే నేను ఫ్యాన్స్ ని ఉద్దేశించి అన్లేదు అంటూ మరో స్టేట్మ్టెంట్ ఇచ్చింది..ఈ మొత్తం అంశంలో రేణు దేశాయ్ గా మాత్రమే కాదు,ఒక పురుషుడి సపోర్ట్ లేకపోతే స్త్రీ అస్తిత్వం కలిగిఉండకూడదా అనే ప్రశ్న తలెత్తుతుంది..ఎందుకంటే ఫ్యాన్స్ కి వ్యతిరేఖంగా వెళితే తనకు ఇప్పుడున్న మద్దతు ఉండదని రేణు భయపడుతుందా..ఒక్కరోజులోనేతన మాటలను ఎందుకు వెనక్కి తీసుకుంది..ముందు రోజు నాకు హేట్ యూ మెసేజ్ లు వస్తున్నాయని మండిపడ్డ రేణు…తర్వాత రోజు నేను ఫ్యాన్స్ ని తప్పుపట్టట్లేదు అని ఎందుకు అన్నట్టు…పవన్ అనే సపోర్ట్ రేణు కి బలం ,బలహీనతగా ఉన్నాయనేది ఈ మధ్యకాలంలో జరిగిన ఈ అంశాల ద్వారా స్పష్టమవుతుంది…

విడాకులు తీసుకున్నప్పటికి ఇప్పటివరకూ రేణు పవన్ ఇద్దరూ ఒకరిఒకరు వ్యతిరేఖంగా మాట్లాడుకున్నది లేదు..జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ మీద అనేక మంది విమర్శలు చేశారు..వాటిల్లో ఇటీవల కత్తి మహేశ్ చేసిన వ్యాక్యలకు ఫ్యాన్స్ ఓవర్ రియాక్ట్ అయ్యారు..దానిపై రేణు కూడా ఇలాంటివి పట్టించుకోనవసరం లేదు అని చెప్పారు. తర్వాత పవన్ తన బర్త్ డే అప్పుడు కూడా మహేశ్ వ్యాఖ్యలను ఇండైరెక్ట్ గా తిప్పికొట్టారు..అశోక్ గజపతి రాజు,పితాని ల వ్యాఖ్యలపై కూడా ఈ మధ్య ట్వీట్ చేశారు పవన్..మరిప్పుడు ఈ లేఖ ఎందుకు రాసినట్టు రేణు వ్యాఖ్యలను డైరెక్ట్ గా ఖండించలేక,సపోర్ట్ చేస్తే ఫ్యాన్స్ వ్యతిరేఖిస్తారేమో  అనే భయంతో ఈ లేఖ రాసారా అనే అనుమానం వ్యక్తమవుతుంది..అంతేకాదు అందులో కువిమర్శలు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది..ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ పట్ల వారిని హెచ్చిరించాల్సింది పోయి ఈ విధంగా స్పందించడం సరి కాదు అని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. .మరోవైపు తమ అధినేత మాటను అభిమానులు ఎంతవరకు వింటారో.. ఈ లేఖ పర్యవసానం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి…

Comments

comments

Share this post

scroll to top