పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన “అజ్ఞ్యాతవాసి” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో).!

Movie Title (చిత్రం): అజ్ఞ్యాతవాసి (agnyatavaasi)

Cast & Crew:

 • నటీనటులు: పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఏమనుల్,ఆది, బోమన్ ఇరానీ, ఖుష్బూ, రావు రమేష్, మురళి శర్మ తదితరులు
 • సంగీతం: అనిరుద్ రవిచందర్
 • నిర్మాత: ఎస్. రాధా కృష్ణ (హారిక అండ్ హాసిని క్రియేషన్స్)
 • దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

Story:

గోవింద్ భార్గవ్ సాధారణ స్థాయి నుంచి ఎదిగిన ఓ కార్పోరేట్ యజమాని. ఆయనతో పాటు కొడుకుని కూడా హత్య చేసి ఏబీ గ్రూప్ కి సీఈవో కావాలనుకుంటాడు సీతారామ్ (ఆది పినిశెట్టి). కానీ గోవింద్ భార్గవ్ కి అభిషిక్త భార్గవ్ (పవన్ కళ్యాణ్) అనే కొడుకు ఉన్నాడని, ప్రత్యర్థులకు భయపడి ఎవరికీ తెలియకుండా అభిని పెంచుతున్నారన్న విషయం వారికి తెలియదు. కానీ తండ్రి, తమ్ముడు మరణంతో సవతితల్లి ఇంద్రాణి(ఖుష్బూ) పిలవడంతో అస్సాం నుంచి వచ్చిన అభి తన తండ్రి వారసత్వంగా ఏబీ కంపెనీకి సీఈవో ఎలా కాగలిగాడన్నదే సినిమా మెయిన్ లైన్. ప్రత్యర్థులను మట్టికరిపించే కార్పోరేట్ సంస్థల వ్యవహారాలను, అభి కుటుంబ పరిణామాలను, మధ్యలో వర్మ( రావు రమేష్), శర్మ తో పాటు వారి కూతుర్లుగా చెప్పుకున్న కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యేల్ ప్రేమ వ్యవహారాలు చివరకు ఎలా ముగిసాయన్నది తెరమీద చూడాల్సిందే.

Review:

పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో ఈ సినిమా. పవన్ కోసమే త్రివిక్రమ్ కథ రాసినట్టు ఉన్నారు. హీరోయిన్లు కీర్తి సురేష్, అనూ పాత్రలు చాలా నామమాత్రం. రావు రమేష్, మురళి శర్మ ల పెర్ఫార్మన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ గురించి కొత్తగా చెప్పనవసరంలేదు. పవన్ కల్యాణ్ చేసిన ఫైట్స్ తెర మీద దిమ్మతిరిగేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ, తివిక్రమ్ డైరెక్షన్ అదిరిపోయేలా ఉంటుంది. అనిరుధ్ అందించిన సంగీతం డిఫెరెంట్‌గా ఉంది. మాస్ + క్లాస్ ఆడియన్స్ అందరికి నచ్చేలా ఉంది సినిమా. పవన్ ఫైట్స్ కూడా ఫాన్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి.

Plus Points:

 • పవన్ కళ్యాణ్
 • త్రివిక్రమ్ డైలాగ్స్
 • మురళి శర్మ, రావు రమేష్ పెర్ఫార్మన్స్
 • సినిమాటోగ్రఫీ

Minus Points:

 • అనిరుద్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది
 • హీరోయిన్స్ తెరపై ఎక్కువసేపు కనిపించలేదు
 • కొన్ని సన్నివేశాలు సాగదీశారు

Final Verdict:

సినిమా మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. ఫాన్స్ కి అయితే తప్పక నచ్చుతుంది.

AP2TG Rating: 3.5 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top