పవన్ వ్యూహం ఫలించేనా ??

ఏపీలో పాలిటిక్స్ రోజు రోజుకు జోరందుకున్నాయి. ఓ వైపు పోలింగ్ దగ్గర పడుతుండడంతో ఎవరి సత్తా ఏమిటో త్వరలో తేలనుంది . రాజకీయ రంగంలో అపార చాణిక్యుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి జరుగుతున్నా ఎన్నికలు యుద్దాన్ని తలపింప చేస్తున్నాయి. గతంలో జగన్ బాబు మధ్యలో పొరుంటే ఈ సారి పవన్ , బాబు, జగన్ ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. ఓటరు నాడి ఏ వైపున ఉన్నదో తెలియక ఆయా పార్టీల నాయకులు..బరిలో దిగిన అభ్యర్థులు ఒక అంచనాకు రాలేక పోతున్నారు . కర్ణాటక రాజకీయం పునరావృతం అవుతుందా లేక వార్ వన్ సైడ్ అవుతుందా అన్నది తేలనుంది . మొత్తంగా చూస్తే జనసేన అధినేత చాలా చోట్ల ప్రభావితం చేయనున్నారు . ఆయన పార్టీ చీల్చే ఓట్లు ఎవరికి లాభం అవుతుందో ఇంకెవ్వరికి నష్టం చేకూరుస్తుందో తెలియడం లేదు.

ఇంకో వైపు ముందస్తు సర్వేలు మాత్రం మళ్ళీ టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు అధికారంలోకి వస్తాడని ..రమారమి 110 సీట్లు వస్తాయని ..వైసీపీ 70 సీట్లకే పరిమితం అవుతాడని ..పవన్ జనసేన కేవలం 10 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించాయి. ఓట్ల శాతం బాబు జగన్ ల మధ్య కేవలం మూడు శాతం తేడా ఉన్నప్పటికీ సీట్ల వరకు వచ్చేసరికల్లా భారీ తేడా కనిపిస్తోందని..అమలు చేస్తున్న పథకాలు ..మహిళలు..రైతులు ..యువతీ యువకులు గంప గుత్తగా బాబు వైపు ఉండ బోతున్నారని ప్రకటించాయి. రాజకీయాలు ఎన్నడూ లేని విధంగా మరింత హీట్ పెంచాయి . గతంలో పవన్, మోడీ లతో చెలిమి చేసిన బాబు ఈసారి ఒంటరి పోరు సాగిస్తున్నారు . అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్నారు . కోట్లాది ప్రజల ఆధారాభిమానాలు కలిగిన కొణిదెల పవన్ వేసే ప్రతి అడుగు ..మాట్లాడే ప్రతి మాటను విపక్షాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి . వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని పవన్ నేరుగా టార్గెట్ చేశారు . తండ్రి చనిపోతే సీఎం కుర్చీ కోసం వెంపర్లాడిన ఆయనకు ఓట్లు అడిగే నైతిక హక్కును కోల్పోయారంటూ ఆరోపించారు . ఏపీలో నెలకొన్న ప్రధాన సమస్యలను పవన్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు .

ఇప్పటికే ఏపీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు . ఉత్తరాంధ్ర ..రాయలసీమ లో పర్యటించారు . జనసేన తరపున రంగంలో దిగిన అభ్యర్థుల తరపున ప్రచారం చేసారు. గడువు సమీపిస్తున్న కొద్దీ మాటల్లో వేడి పెంచారు . అటు టిడిపిని ఇటు వైసీపీని టార్గెట్ చేశారు . ఒకరు అవినీతికి కేరాఫ్ గా మారితే ఇంకొకరు అధికారం కోసం రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు . చాలా చోట్ల ఇరు పార్టీల అభ్యర్థులను జనసేన అభిమానులు ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు . ఏపీలో టిడిపికి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు బలమైన క్యాడర్ ఉన్నది . అమలవుతున్న పథకాలు ఆ పార్టీకి మరోసారి అధికారంలోకి వచ్చేలా చేయబోతున్నాయి . అభిమానం వేరు రాజకీయం వేరు ..కోట్లాది అభిమానులు కలిగిన పవర్ స్టార్ ఏ మేరకు ఓట్లుగా మలుచుకుంటారో వేచి చూడాలి . దివంగత ఎన్ఠీఆర్ ప్రచారం చేసి పవర్లోకి వచ్చినా జనం కల్వకుర్తిలో ఓడించారు . జనం నాడిని పట్టుకోవడం అంత సులువు కాదు . పార్టీ పరంగా చూస్తే ఇంకా పూర్తిగా దాని నిర్మాణం జరగలేదు . జనసేన వామపక్షాలతో జత కట్టినా ఇప్పుడు నేరుగా మాయావతి బీఎస్పీ పార్టీతో కలిసి బరిలో నిలిచారు . మొత్తం మీద ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల గెలుపు ఓటములపై తన మార్క్ చూపించనున్నారు .

Comments

comments

Share this post

scroll to top