“పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” కి ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి మన తెలుగు ఆడియన్స్ కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట!…సినిమాలతోనే కాదు రాజకీయాలతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు “పవన్ కళ్యాణ్”. పవన్ కళ్యాణ్ కి సంబందించిన ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అదేంటి అంటే..ఆయన పేరు మార్చుకున్నారు అని..! గూగుల్ లో పవన్ కళ్యాణ్ అని సెర్చ్ చేయగానే “కుషాల్ బాబు” అని చూపిస్తుంది.! కళ్యాణ్ బాబు అనేది పవన్ కళ్యాణ్ అసలు పేరు. సినిమాల కోసం పవన్ కళ్యాణ్ గా మారారు. మరిప్పుడు “కుషాల్ బాబు” ఏంటి?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్సకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు..ఈ కొత్త పేరును దర్శకుడు త్రివిక్రమ్ సూచించినట్టు టాలివుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ విషయం కూడా సాధారణమే.. కాని నెటిజన్లను ఆసక్తిగొల్పుతున్న విషయం ఒకటుంది. అదేమిటంటే ప్రస్తుతం గూగుల్ లో పవన్ కళ్యాణ్ అని సెర్చ్ చేస్తే కుశాల్ బాబుగా సూచిస్తోంది.. దీంతో ఆయన రాజకీయ రంగంలో రాణించేందుకు ఏదయినా కొత్త పేరు ఎంచుకున్నారా అని కొందరు చర్చ చేస్తున్నారు.?
ఈ విషయంపై క్లారిటీ రావాలంటే..స్వయంగా ఆయనే స్పందించే వరకు వెయిట్ చేయాలి!