దుమ్మురేపుతున్న కాట‌మ‌రాయుడు అఫిషియ‌ల్ టీజ‌ర్‌..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటేనే ఆయ‌న అభిమానులకే కాదు, సినీ ప్రియుల‌కు కూడా ఎంతో ఆస‌క్తిగా ఉంటుంది. ప్ర‌ధానంగా మాస్ ఆడియ‌న్స్‌కైతే ప‌వ‌న్ సినిమా వ‌స్తుందంటే పండ‌గే. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఉండే ఏ యాక్ష‌న్ బిట్‌ను విడిచిపెట్టేందుకు కూడా ఫ్యాన్స్ ఇష్ట‌ప‌డ‌రు. అంత ఇష్టంతో చూస్తారు. మ‌రి… అలాంటి సాధార‌ణ మాస్ సీన్స్‌తోపాటు ఫ్యాక్ష‌నిజం కూడా క‌లిస్తే… అప్పుడు ఇక అభిమానులకు ఇంకా పెద్ద పండుగే అవుతుంది. ఈ క్ర‌మంలో ఆ పెద్ద పండుగ కాట‌మ‌రాయుడు రూపంలో రానుందా..? అంటే అందుకు సమాధానం అవున‌నే వినిపిస్తోంది. ఎందుకంటే… ఈ సినిమా మొత్తం ఫ్యాక్ష‌నిజం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న‌దేన‌ట‌. అందుకు శాంపిల్‌గా తాజాగా ఆ చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన కాట‌మ‌రాయుడు అఫిషియ‌ల్ టీజ‌ర్ వీడియోను చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంది.

చూశారుగా..! కాట‌మ‌రాయుడు అఫిషియ‌ల్ టీజ‌ర్‌ను. ”ఎంత మంది ఉన్నార‌న్న‌ది ముఖ్యం కాదు, ఎవ‌డున్నాడ‌నేదే ముఖ్యం” అంటూ యాక్ష‌న్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప‌వ‌న్ చెబుతున్న డైలాగ్ వింటే అభిమానుల‌కు రోమాలు నిక్క‌బొడుచుకోవంటే న‌మ్మండి..! ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, ఫెస్టివ‌ల్ లుక్‌లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇప్పుడు టీజ‌ర్ కూడా వచ్చిన నేప‌థ్యంలో సినిమా ట్రైల‌ర్ కోసం అభిమానులు మ‌రింత‌గా ఎదురు చూస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

katamrayudu-teaser-

అన్నీ అనుకున్న‌ట్టు కుదిరితే మార్చి లోనే కాట‌మ‌రాయుడు మ‌న ముందుకు రానున్నాడు. ఇక థియేట‌ర్స్ ఆ రాయుడు ఎంత‌టి సంద‌డి చేస్తాడో వేచి చూడాలి. అన్న‌ట్టు ఇంకో విష‌యం… ఇందులో హీరోయిన్ ఎవ‌రో తెలుసు కదా. శృతి హాస‌న్‌. గ‌బ్బ‌ర్ సింగ్‌లో ప‌వ‌న్ స‌ర‌స‌న మెస్మ‌రైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన శృతి కాట‌మ‌రాయుడులో ఎలా క‌నిపిస్తుందో చూడాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top