కత్తి మహేష్ – పవన్ గొడవ చూపిస్తున్నారు..కానీ ఆ యువతి పోస్ట్ మాత్రం ఎందుకు చూపించట్లేదు..?

పవన్ రావాలి..సమాధానం చెప్పాలి..ఫ్యాన్స్ వైఖరిని ఖండించాలి అంటూ గత కొన్ని నెలలుగా కత్తి మహేశ్ వార్తల్లో ఎండగడుతూనే ఉన్నారు.కానీ పవన్ మాత్రం ఈ వ్యవహారం పట్టనట్టే ఉంటున్నారు.పవన్ ఎందుకు రావాలి..రారు..నీకెందుకు సమాధానం చెప్పాలి అంటూ పవన్ ఫ్యాన్స్ కత్తిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.అయితే ఈ మధ్య పవన్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అజ్ణాతవాసి రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది..అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ వారణాసిలో జరిగింది..అక్కడ వర్క్ చేసే మన తెలుగు వ్యక్తి పవన్ ని కలిసి తనతో ఫోటో దిగాడు..అయితే పండక్కి వస్తున్న అతను మధ్యలోనే యాక్సిడెంట్ అయి చనిపోయారు.ఇదే విషయాన్ని వాళ్ల సిస్టర్ ట్వీట్ చేసింది..అయితే  చనిపోయిన తన అన్న వివరాలు లోకల్ పేపర్లో చూసిన పవన్ మేనేజర్ కి చెప్పి లక్ష రూపాయాలు చెక్ పంపిచారట..

పవన్ ఫ్యాన్స్,కత్తి   వ్యవహారం అంతా చూస్తున్న జనానికి  పవన్ వీరిని వారించొచ్చు కదా,చెప్పొచ్చు కదా అనిపిస్తుంది..కొందరికి ఎందుకు రావాలి..అసలు పవన్ కి ఈ విషయం పట్టించుకునే తీరిక ఉందా అనిపిస్తుంది..కానీ ఎక్కడో లోకల్ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక అభిమాని వార్త చూసి అతడికి ఆర్దిక సహాయం చేసిన పవన్ కి,మెయిన్ న్యూస్ ఛానెల్స్ ఇదే న్యూస్ గా వాయించేస్తూ ఉంటే తెలీకుండా ఉంటుందంటారా అనేది మరో ప్రశ్న…రా రా అని పిలిస్తే వచ్చేయడానికి తనేమన్నా కత్తా..ఎక్కడికి రావాలో ఏ విషయానికి స్పందించాలో తనకి తెలుసు అంటూ పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు..అదేనండీ అజ్ణాతవాసి పండుగ

Comments

comments

Share this post

scroll to top