వెంకట్ రాహుల్‌కు పవన్ కళ్యాణ్ భారీ నజరానా..! వెంకట్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?

గోల్డ్ కోస్ట్లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన గుంటూరు కుర్రాడు రాగాల వెంకట్ రాహుల్‌కు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ భారీ నజరానా ప్రకటించారు. .వెయిట్ లిఫ్టింగ్ 85 కిలోల విభాగంలో పసిడి పతకం సాధించిన రాహుల్‌కు పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేధికగా కంగ్రాట్స్ తెలిపుతూ ,ఈ బహుమతి అందజేస్తున్నట్టు తెలిపారు.
‘వెంకట్ రాహుల్ రాగాలకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించి, భారతదేశం గర్వించేలా చేసిన అతనికి జనసేన పార్టీ తరఫున రూ.10 లక్షలు అందిస్తాము. అతను సాధించిన ఈ అపూర్వ ఘనతకు జనసేన పార్టీ తరఫున సెల్యూట్ చేస్తున్నాము’’ అని తన ట్విట్టర్లో  పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
రాగాల వెంకట రాహుల్ పేద కుటుంబంలో జన్మించారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని స్టువర్టుపురం  రాహుల్ సొంతూరు.ఈ ప్రాంతం ఒకప్పుడు దొంగలకు బాగా ఫేమస్..ఇకపై స్టువర్ట్పురం అంటే బంగారు పతకం సాధించిన రాహుల్ ఊరు అనే గర్వపడేలా చేశాడు. రాహుల్ తండ్రి మధు కూడా ఒకప్పుడు జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టర్‌గా రాణించారు. పేదరికం వల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదగలేకపోయిన ఆయన సంతానం ద్వారా తన కలను సాకారం చేసుకోవాలని ఆరాట పడుతున్నారు. ఇందుకోసం సొంతింటిని కూడా అమ్మి కుమారులకు వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ ఇప్పించారు. వెంకట్ రాహుల్ 85 కిలోల పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 338 కిలోల వెయిట్స్ ఎత్తి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు రాహుల్‌కి దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకూ ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో భారత అథ్లెట్లు 10 స్వర్ణ పతకాలు సాధించారు.

Comments

comments

Share this post

scroll to top