పెళ్లిలో “సమంత” కు “త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్” ఏం గిఫ్ట్ పంపి సర్ప్రైస్ చేసారో తెలుసా..? రిసెప్షన్ లో ఇద్దామనుకుని..!

Sainath Gopi

వారం రోజులుగా ఎక్కడ చూసినా సమంత, నాగచైతన్య పెళ్లి గురించిన వార్తలే. కుటుంబ సభ్యులు, సన్నిహతుల మధ్య వీరిద్దరూ అక్టోబర్ 6న గోవాలో పెళ్లాడారు. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహమైంది. పెళ్లి కానుకగా సామ్-చై దంపతులకు పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ ఊహించని రీతిలో గిఫ్ట్‌ను పంపారట. కొత్త జంట కోసం రెండు డైమండ్ రింగ్‌లను వీరు బహుమతిగా పంపించారట. ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్లో పాల్గొని కొత్త జంటకు ఉంగరాలు ఇవ్వాలని పవన్, త్రివిక్రమ్ ముందుగా భావించారట. కానీ ప్లాన్ మార్చుకొని పెళ్లి సమయంలో నూతన దంపతులకు ఈ గిఫ్ట్‌ను పంపి సర్‌ప్రైజ్ చేశారట. అయితే ఈ వార్తల పట్ల అటు చైతూ సమంతలు గానీ, ఇటు పవన్, త్రివిక్రమ్ గానీ స్పందించలేదు. పవర్ స్టార్ సరసన సమంత ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించారు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

 

Comments

comments