“పవన్ కళ్యాణ్” పై “మహేష్ కత్తి” సంచలన వ్యాఖ్యలు..! లైవ్ లోనే ఫాన్స్ ఏం చేసారో తెలుసా..?

ప్రముఖ సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కంటే మహేశ్ పెద్ద స్టార్ అని పేర్కొన్నారు. పవన్ తన అభిమానులకు మాత్రమే స్టార్ అని, తనకు కాదన్నారు. ఓ టీవీ చానల్‌ నిర్వహించిన లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాను పబ్లిసిటీ కోసమో, మరో దాని కోసమో ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, ఒకవేళ పబ్లిసిటీనే కావాలనుకుంటే మహేశ్ బాబు గురించి మాట్లాడితే సరిపోతుందని పేర్కొన్నారు.


తాను మాట్లాడిన మాటలను యూట్యూబ్‌లో మూడు నిమిషాలు చూసి తనపై పవన్ ఫ్యాన్స్ మండిపడడం సరికాదన్నారు. తాను అందరి గురించీ మాట్లాడతానన్నాడు. తానేమీ పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం లేదని, తన అభిప్రాయాన్ని వెల్లడించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తానేమీ సెలబ్రిటీని కాదని, కానీ పవన్ ఫ్యాన్సే తనను సెలబ్రిటీని చేస్తున్నారన్నారు. పవన్‌ను నెత్తిన పెట్టుకుని తిరగడం ఆయన ఫ్యాన్స్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. తన మొబైల్ నంబరును వాట్సాప్ నెంబర్లలో పెట్టి హింసించే ప్రయత్నం చేస్తున్నారని మహేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

watch video here:

మహేష్ కత్తితో ఫోన్‌లో మాట్లాడిన కొంతమంది మెగా హీరోల అభిమానులు.. మహేష్ కత్తి తన వైఖరి మార్చుకోకుంటే పరిస్థితులు మరోలా వుంటాయని లైవ్‌లోనే హెచ్చరించారు. అసలు మహేష్ కత్తిని సినిమాలకి రివ్యూలు రాసే రివ్యూయర్‌గా ఎవరు సర్టిఫై చేశారని పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఒకరు అడిగిన ప్రశ్నకు స్పందించిన మహేష్ కత్తి… ఆ మాటకొస్తే, పవన్ కల్యాణ్‌ని మాత్రం హీరోగా ఎవరు సర్టిఫై చేశారు అని ఎదురు ప్రశ్నించారు. సరిగ్గా మహేష్ కత్తి చేసిన ఈ వ్యాఖ్యలే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి మరింత ఆగ్రహం తెప్పించాయి. దీంతో మహేష్ కత్తి, మెగా హీరోల అభిమానులకి మధ్య డిబేట్ మరింత వేడెక్కింది.

Comments

comments

Share this post

scroll to top