పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్సా.. మజాకా..! అవును మరి. వారు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఎందుకంటే వారు పవన్ ఫ్యాన్స్ కదా. ఆ మాత్రం వెరైటీ లేకపోతే ఎలా..? ఇంతకీ ఏంటి మ్యాటర్ అంటారా..? ఏమీ లేదండీ… సాధారణంగా హిందుల వివాహ శుభకార్యాల్లో నూతన వధూవరులకు పండితులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదా. అవును, అయితే ఏంటి… అంటారా..! అక్కడే ఆగండి..! ఎందుకంటే కర్ణాటకలో జరిగిన ఆ పెళ్లిలో అరుంధతి నక్షత్రంకు బదులుగా ఆ వధూవరులు ఏం చూశారో తెలుసా..? ఇంకెందుకాలస్యం… దాని గురించి తెలుసుకుందాం రండి..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌కు ఎంత మంది అభిమానులు ఉన్నారో తెలుసు కదా. వారి సంఖ్యను మాటల్లో చెప్పలేం. అదేవిధంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఓ అభిమాని ఏం చేశాడంటే… తనకు పెళ్లి అవగానే పండితుడు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తానని తీసుకెళ్లగా… అందుకు ఆ అభిమాని నిరాకరించాడు. తనకు ఇష్టమైన హీరో పవన్ కల్యాణ్ అని, ఆయన ఫొటోనే చూస్తానని అతను పట్టుబట్టాడు. దీనికి తోడు వధువు కూడా అందుకు ఒప్పుకుంది. ఇంకేముంది నూతన వధూ వరుల కోరికను ఎవరూ కాదనలేకపోయారు.
ఈ క్రమంలో వెంటనే పవన్ కల్యాణ్ ఫొటోను ఫ్లెక్సి రూపంలో తయారు చేసి పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. ఇంతకీ ఆ ఫొటో ఏ సినిమాలోదో తెలుసా..? అదేనండీ త్వరలో రిలీజవుతున్న కాటమరాయుడు సినిమాలోదే ఆ పోస్టర్. అందులో అచ్చమైన పంచెకట్టుతో కనిపించే పవన్ ఫొటోనే ఫ్లెక్సి రూపంలో వేశారు. ఆ ఫొటోనే నూతన వధూవరులు చూశారు. అదీ కథ..! అవును మరి. పవన్ ఫ్యాన్స్ అంటే మాటలు కాదు కదా..! ఆయన కోసం వెరైటీగా ఏదైనా చేస్తారు. అభిమానం అలాంటిది మరి..!