పవన్ కళ్యాణ్ “క్లాప్” కొడుతుంటే “ఎన్టీఆర్” నవ్వుతూనే ఉన్నారు…క్లాప్ కొట్టిన తర్వాత పవన్ ఏం చేసారో తెలుసా.?

మన టాలివుడ్లో ఒక నెగటివ్ రిమార్క్ ఉంది..మన సినిమా హీరోలు ..ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు వెళ్లరు..ఒకరి సినిమాను మరొకరు ఎంజాయ్ చేయరు..ఒకరి హిట్ ను మరొకరు ఆస్వాదించలేరు..కలిసి నటించడానకి కూడా వారి ఇగోలు అడ్డొస్తాయి..ఇలాంటి ఎన్నో కామెంట్స్ హీరోల గురించి మనం వింటూంటాం.దానికి తగ్గట్టుగానే వారి ఫ్యాన్స్ మధ్య కూడా ద్వేషాలు ,గొడవలు..కానీ కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు అవన్ని నిజాలు కాదు అనిపిస్తుంటుంది..సరిగ్గా అలాంటిదే ఎన్టీయార్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో జరిగింది…

watch video here:

https://youtu.be/_nEjv22ecoU

ఎన్టీయార్ ,త్రివిక్రమ్ కాంభినేషన్లో మొదటి సారి సినిమా ప్రారంభమైంది.ఇది అటు ఎన్టీయార్ ఫ్యాన్స్ కి ,ఇటు త్రివిక్రమ్ ఫ్యాన్స్ కి కూడా పండుగ లాంటిదే..ఈ సినిమా ప్రారంభోత్సవానికి పవన్ ఛీప్ గెస్ట్ గా వచ్చారు.పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి అత్యంత సన్నిహితుడని మనందరికి తెలిసిందే..ఎన్టీయార్ కి కూడా పవన్ తో మంచి స్నేహభందం ఉంది.ఇక పవన్ క్లాప్ కొట్టడం స్టార్ట్ అయినప్పటి నుండి అక్కడ నవ్వుల వాతావరణమే..ఎవరికైనా తమ స్నేహితుడి ముందు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది..అందులోనూ పవన్ కళ్యాణ్..ప్రారంభోత్సవం ఆద్యంతం ఎన్టీయార్ తో పాటు,అక్కడున్న అందరూ నవ్వుతూనే ఉన్నారు..మరొక ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటంటే క్లాప్ కొట్టగానే ఎన్టీయార్ కెమెరాకి కనపడేలా ఉండాలని పవన్ అక్కడే కింద కూర్చునిపోయారు..దానికి త్రివిక్రమ్ ఎంత పనైపోయింది సర్ అంటూ కామెంట్ చేయడం…వెంటనే ఎన్టీయార్ వెనక్కి తిరిగి పవన్ ని హగ్ చేసుకోవడం,పవన్ ఆల్ ది బెస్ట్ చెప్పడం నిజంగా ఒక మంచి  సంతోషకర వాతావారణాన్ని ప్రతిబింబించింది..

Comments

comments

Share this post

scroll to top