ఏం మాట్లాడకుండానే చాంబర్ నుంచి వెళ్లిపోయిన పవన్.! “ఫిలిం ఛాంబర్” లో అసలేమైంది.? మీడియా చూపించనిది ఇదేనా.?

ఫిలించాంబర్ నుంచి పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితమే వెళ్లిపోయారు. పవన్ కోసం గంటల తరబడి చాంబర్ బయట పడిగాపులు కాసిన ఫ్యాన్స్ ఆయనను చూడగానే సీఎం.. సీఎం… అంటూ నినాదాలు చేశారు. పవన్ కూడా అభిమానులకు అభివాదం చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రెస్‌మీట్ పెడతారని అందరూ భావించినప్పటికీ పవన్ ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ట్విట్టర్ వేదికగా ఏం జరిగిందో.. ఎందుకు చాంబర్‌కు వచ్చారో వివరించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి పవన్ చాంబర్‌లోనే ఉన్నారు. తన తల్లిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బాధ్యులపై న్యాయపరమైన పోరాటం చేయాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా కొందరు న్యాయవాదులతో పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ సమావేశమయ్యారు. పవన్‌కు మద్దతు తెలిపేందుకు పలువురు సినీ ప్రముఖులు చాంబర్‌కు చేరుకున్నారు.

అల్లు అర్జున్, రామ్‌చరణ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, బండ్ల గణేష్, బన్నీ వాసు, హైపర్ ఆది, కృష్ణుడు, శివబాలాజీ, గాయత్రి గుప్తా తదితరులు పవన్‌కు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇదిలా ఉంటే, ‘మా’ అసోషియేషన్ సభ్యులతో, నిర్మాతల మండలి సభ్యులతో కూడా ఈ వ్యవహారంపై పవన్ చర్చించినట్లు తెలిసింది. ఎవరూ ఈ వ్యవహారంపై మీడియాకు వెళ్లి చర్చల్లో పాల్గొనవద్దని పవన్ కోరినట్లు సమాచారం. ఇది సున్నితమైన అంశమని, తొందరపడి ఎవరూ వ్యాఖ్యలు చేయొద్దని పవన్ ఈ సమావేశంలో చెప్పినట్లు సమాచారం.

Comments

comments

Share this post

scroll to top