శ్రీరెడ్డిపై పవన్ రియాక్షన్ : వెళ్లాల్సింది పోలీస్ స్టేషన్ కు.. టీవీ స్టూడియోలకి కాదు

తెలుగు వారికి అవకాశాలు ఇవ్వాలంటూ,ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందంటూ గత నెల రోజులుగా  సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా మారింది శ్రీరెడ్డి..అర్దనగ్న నిరసనతో దేశవ్యాప్తంగా స్పందన వచ్చేలా చేసింది.శ్రీరెడ్డి పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది.ఈ క్రమంలో  సినీ ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పై తనదైన స్టయిల్ లో స్పందించారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

శ్రీరెడ్డి అర్దనగ్న నిరసనను తొలుత వ్యతిరేఖించి,శ్రీరెడ్డిని బహిష్కరించింది మా అసోషియేషన్.తనతో మా అసోసియేషన్ సభ్యులెవరం నటించమని స్పష్టం చేసింది..జాతియ స్థాయిలో స్పందన రావడం,మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గింది. ఈ నేపధ్యంలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇంతగా చర్చ జరుగుతున్న అగ్రతారలు స్పందించడం లేదెందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి..అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఇందిగాంధీ విగ్రహం దగ్గర కతువా ఘటనపై నిరసన వ్యక్తం చేశారు.ఆసిఫా ఘటనపై  కేంద్రం  చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ఓ చిన్నారిని అత్యంత కిరాతకంగా వారం రోజులు అత్యాచారం చేసి.. ఆ తర్వాత చంపటాన్ని అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. దీన్ని రాజకీయంగా చూడొద్దన్నారు. సింగపూర్ తరహా చట్టాలు ఉంటేనే ఇలాంటి ఘటనలు జరగవు అన్నారు.

ఇక సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై  శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై కూడా పవన్ కళ్యాణ్  స్పందించారు. సినీ ఇండస్ట్రీలో అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లు, కోర్టులను ఆశ్రయించాలి. అంతేకానీ టీవీ స్టూడియోలకి కాదని శ్రీరెడ్డికి చురకలు అంటించారు.నేను మద్దతిచ్చినా లీగల్ గా ప్రొసీడ్ కానంతవరకు ఏ ఉపయోగం ఉండదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్యాయానికి గురయ్యి కోర్టుకి వెళ్లే వారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. షూటింగ్ జరిగే చోట్ల ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయని… తన దృష్టికి వచ్చినవాటిని అడ్డుకున్నానని అన్నారు..కాస్టింగ్ కౌచ్ పై వ్యాఖ్యలు చేసినప్పుడు మొదట్లోనే పవన్ ని టార్గెట్ చేస్తూ ,పవన్ గారూ స్పందించాలంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..ఇప్పుడు పవన్ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తుందో ..చూద్దాం..

Comments

comments

Share this post

scroll to top