పవిత్రమైన ప్లేస్ కి “ఛార్మి” ఎలాంటి డ్రెస్ వేస్కొచ్చిందో తెలుసా..? ట్విట్టర్ లో ఎలా తిడుతున్నారు అంటే..!

సెల‌బ్రిటీల్లో ముఖ్యంగా హీరోయిన్లు ధ‌రించే దుస్తులు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంటాయి. ఏవైనా అవార్డు ఫంక్ష‌న్ల లాంటివి జ‌రిగిన‌ప్పుడు ఇక ఆక‌ట్టుకునే డ్రెస్ వేసుకుంటే అంద‌రి క‌ళ్లు ఆ డ్రెస్ పైనే ఉంటాయి. కరెక్టే మ‌రి. అంద‌రి దృష్టి ప‌డాల‌న్నా, మంచి అవ‌కాశాలు రావాల‌న్నా హీరోయిన్స్ ఆ మాత్రం చేయాల్సిందే. లేదంటే వెన‌క‌బడిపోతారు గ‌దా. ఇంత వ‌ర‌కు ఓకే. కానీ కొంద‌రు హీరోయిన్స్ వేసుకునే దుస్తులే కాదు, అవి వేసుకుని కొన్ని కొన్ని ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా భ‌క్తులు అతి ప‌విత్ర‌మని భావించే స్థలాల్లో. అలా ప‌విత్ర‌మైన ఓ చోటుకి హీరోయిన్ చార్మి ఓ ర‌క‌మైన దుస్తుల‌ను వేసుకుని వెళ్లి ప్రార్థ‌న‌లు చేసింది. అక్క‌డితో ఆగ‌కుండా ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఆమె అంద‌రి దృష్టిలో అభాసుపాలైంది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే…

హీరోయిన్ చార్మి పైసా వసూల్ చిత్రం షూటింగ్‌ కోసం పోర్చుగల్ లో ఉంది. కాగా అక్క‌డే ఉన్న ఓ గురుద్వారాను చార్మి సంద‌ర్శించింది. ఆ త‌రువాత అందులో ప్రార్థ‌న‌లు చేసింది. తాను ప్రార్థ‌న‌లు చేస్తున్న ఫొటోల‌ను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది. అయితే ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా గురుద్వారాకు ఆమె వేసుకు వ‌చ్చిన డ్రెస్ ప‌ట్ల నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. పైన కేవ‌లం కుర్తా లాంటి టాప్ మాత్ర‌మే ఉండ‌గా, కింద ఏమీ లేదు. దీంతో మోకాళ్ల పై భాగం వ‌ర‌కు క‌నిపిస్తూనే ఉంది. అలాంటి డ్రెస్‌తోనే ఆమె గురుద్వారాలో ప్రార్థ‌న‌లు చేసింది. అత్యంత ప‌విత్ర‌మైన ఆ స్థలంలో అలాంటి దిక్కుమాలిన డ్రెస్ వేసుకున్నావేంట‌ని అభిమానులు ట్విట్ట‌ర్ వేదిక‌గా చార్మికి ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

దేవాలయాలలో వస్త్రధారణ ఇలానే ఉంటుందా అంటూ ఆమెపై తిట్ల పురాణం కురిపిస్తున్నారు. మందిరంలో పద్ధ‌తిగా ఉండాల్సింది పోయి ఇలాంటి బట్టలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని చార్మిని ప్రశ్నిస్తున్నారు. అయితే చార్మి కావాలని ఇలా చేసుండ‌ద‌ని, షూటింగ్ సంద‌ర్భంగా ప‌క్క‌నే ఉన్న గురుద్వారాకు వ‌చ్చి ఉంటుంద‌ని, ఇందులో త‌ప్పు ప‌ట్టాల్సిన పనిలేద‌ని కొంద‌రు అంటున్నారు. కానీ మెజారిటీ నెటిజ‌న్లు మాత్రం చార్మి చేసింది క‌రెక్ట్ కాద‌ని, అలాంటి ప‌విత్ర స్థలంకు వెళ్లే ముందు ఓసారి డ్రెస్‌ను చూసుకుని ఉండాల్సింద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి దీనిపై చార్మి ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top