మ‌రోసారి తండ్రికాబోతున్న ప‌వ‌న్.!

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాలతో చాలా బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న పవన్, ఆ తర్వాత ఆర్ టీ నీసన్ తోను ఓ సినిమా చేయనున్నాడు.మరోవైపు జనసేన పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా శతఘ్నీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కట్ చేస్తే పవన్ మరో సారి తండ్రి కాబోతున్నాడని  ఓ వార్త చక్కర్లు కొడుతుంది.

అక్కడమ్మాయి,ఇక్కడ అబ్బాయి సినిమా చేసిన తర్వాత వైజాగ్ కి చెందిన నందినితో పవన్ కళ్యాణ్ వివాహం జరిగింది.ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి..పెళ్లి నాటికి పవన్ వయసు 26,నందిని వయసు19..నందిని చిన్నవయసు కావడం వలన అర్దం చేసుకోలేకపోవడం వలనో మరే ఇతర కారణం చేతనో పెళ్లి అయిన కొద్ది రోజులకే పవన్ ,నందిని చట్టపరంగా విడాకులు తీసుకోకుండానే  వేరు వేరుగానే ఉన్నారు.వీరికి పిల్లలు లేరు. బద్రి  సినిమా షూటింగ్ సమయంలో రేణుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి సహజీవనానికి దారి తీసింది.రేణుతో సహజీవనం కారణంగా వీరికి అకీరా అనే కొడుకు పుట్టాడు.అకీరా పుట్టిన తర్వాత రేణుని పవన్ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు.పెళ్లికి ముందు నందినికి విడాకులు ఇచ్చారు..పెళ్లి తర్వాత రేణు కి ఆధ్య అనే కూతురు పుట్టింది.కొద్దిరోజులకు రేణు దేశాయ్ కి కూడా పవన్ విడాకులిచ్చారు.అయినప్పటికి పవన్ అభిమానులు రేణునే వదినలా ఫీల్ అవుతారు..ఆమె స్థానాన్ని వేరొకరికి భర్తీ చేయలేం అంటారు.అకీరా ,ఆధ్య కూడా రేణుదేశాయ్ తో పాటు పుణెలో ఉంటున్నారు.రేణు పిల్లల్ని చూసుకుంటూ సినిమా నిర్మాణ రంగంవైపు ఉంది.వీరిద్దరూ కలవాలని అభిమానులు కోరుకుంటూ పదే పదే వత్తిడి తెస్తున్న కారణంగా ఇటీవల రేణు ఫేస్ బుక్ లో పోస్టు కూడా పెట్టారు.పవన్ తాను కలవడం ఇక జరగని పని అని,తామిద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఎప్పటికీ కలిసుంటామని ..అభిమానులుగా మీరు కూడా అది అర్దం చేసుకోవలన్నది ఆ పోస్టు సారాంశం.

రేణుతో బంధానికి చెక్ చెప్పిన తర్వాత పవన్ తీన్మార్ సినిమాలో తనతో పాటు నటించిన రష్యన్ లేడి అన్నా లెజినావోని మూడో పెళ్లి చేసుకున్నాడు. చాలా రోజులు గోప్యంగా ఉంచిన తర్వాతే వీరి బంధం బయటపడింది.వీరికి పొలేనా అనే పాప ఉంది.ఇప్పుడు మరోసారి పవన్ తండ్రి కాబోతున్నారని విషయాన్నే బలపరుస్తున్నది ఏంటంటే  అన్నా ఓ షాపింగ్ మాల్ లో బేబి బంప్ తో కనిపించిందనే వార్త.. . దీనిని మెగా కాంపౌండ్ ఖండించకపోవడంతో, ఇది నిజమేనని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు.

రేణు కి విడాకులు ఇచ్చినప్పటికి పిల్లలైన అకీరా,ఆద్యా ల బాద్యత విషయంలో తండ్రిగా పవన్ తప్పుకోలేదు.వారికి సంభందించిన అన్ని విషయాలను పవనే దగ్గరుండి చూసుకుంటున్నారు.ఇటివలే అకీరా,ఆధ్యా మరియు పొలేనాలను తీసుకుని పవన్ హాలిడే ట్రిప్ కి వెళ్లొచ్చారు.అన్నా లెజోనివా కూడా అకీరా ,ఆద్యలతో సన్నిహితంగా ఉంటున్నారని కొన్ని ఫొటోస్ ని గమనిస్తే మనకు తెలుస్తుంది. అంతే కాదు అన్నా లెజోనివా మెగా ఫ్యామిలితో కూడా బాగా కలిసిపోయారు.శ్రీజ పెళ్లప్పుడు అందరితో పాటు తను కూడా సంప్రాదాయ పద్దతిలో రెడి అవ్వడమే కాకుండా కుటుంబంలో సభ్యురాలిగా కలిసిపోయారని సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఫోటోస్ చెప్పకనే చెప్పాయి. లెజోనివా కి అక్టోబర్లో డెలివరీ డేట్ ఇచ్చారని అంటున్నారు.డెలివరీ టైంలో భార్యకి దగ్గరగా ఉండాలనే పవన్ ఫారన్ లో  షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసుకుని వచ్చేశారిని కూడా అంటున్నారు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే దీపావళికి ముందుగానే పవన్  ఇంట్లో సంబరాలు వస్తాయన్నమాట..

Comments

comments

Share this post

scroll to top