చిరు ఇంటికి వెళ్లి విష్ చేసిన పవన్….నాగబాబు ఎఫెక్టేనా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లి అన్నయ్య కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిన్న శిల్ప కళా వేదికలో జరిగిన చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్ లో పవన్ పై, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు పెద్ద ఎత్తున మండిపడ్డ విషయం తెలిసిందే.. మేం ఎన్నో సార్లు పిలిచాం..కానీ ఆయన రాకపోతే మేమేం చేయాలి అంటూ కాసింత ఆగ్రహాన్ని   ప్రదర్శించారు నాగబాబు.

అయితే తాజాగా  గుజరాత్ లో సర్థార్ షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్.. తన షూటింగ్ ను వాయిదా వేసుకొని అన్న చిరంజీవి ని విష్ చేయడానికి జూబ్లిహిల్స్ లోని చిరు ఇంటికి వచ్చాడు.  అర గంటకు పైగా అన్నతో గడిపాడు. చాలా రోజుల తర్వాత పవన్ చిరు ఇంటికి వెళ్లాడు. ఈ రోజు పార్క్ హయాత్ లో జరగబోయే చిరు బర్త్ డే  వేడుకలో కూడా  పవన్ పాల్గొంటారు  అని సమాచారం అందుతుంది.

pavan visits chiru home

పవన్  సడెన్ గా షూటింగ్ ను పక్కన పెట్టి, అన్న ను విష్ చేయడానికి హైద్రాబాద్  వచ్చాడంటే నాగబాబు  నిన్నటి మాటలు ప్రభావం చూపాయా?  అనే చర్చ అంతటా జరుగుతోంది. ఏది ఏమైనా… కుటుంబం అన్నగారి కుటుంబం ..అన్నట్లు  మెగా ఫ్యామిలీ  ఉంటే..  ఫ్యాన్స్ కు అంతకు మించి కావాల్సిందేముంది..

WATCH:  నాగబాబు ఫైర్స్ ఆన్ పవన్ ఫ్యాన్స్.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top