అవసరమైతే సంతోషంగా జైలుకు వెళతానన్న పవన్ కళ్యాణ్.

మొన్న తెలుగు రాష్ట్రాల పరిస్థితులపై  పవన్ ప్రెస్ మీట్, నిన్న రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ పవన్ పై పిర్యాదు, నేడు అవసరమైతే  జైలుకు, కోర్టుకు వెల్లడానికైనా సిద్దం అని పవన్ వ్యాఖ్యలు. పవన్ ఎపిసోడ్ మొత్తం హాట్ హాట్ గా సాగుతోంది.

పవన్ ప్రెస్ మీట్ తర్వాత ఒకవైపు రాజకీయ విమర్శలు వస్తుంటే,  మరోవైపు తెలంగాణ న్యాయవాదుల సంఘం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ పవన్ పై  పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. అయితే దీనిపై పవన్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు.

pavan tweet on case

అవసరమనిపిస్తే ఈ విషయంలో జైలుకు వెళ్లడానికి,  ఇంకా అంటే  కోర్టుకు  వెళ్లడానికి  కూడా సిద్దం అని ఈ రోజు తన ట్విట్టర్ లో తెలియజేశాడు.  ఎవరైతే నా మీద పోలీస్ కంప్లైట్ చేశారో వారికి స్పష్టంగా ఈ మాటలు  చెబుతున్న అంటూ కౌంటర్ ఇచ్చారు పవన్.

pavan tweets against mps

ఇక తనపై తెలుగు తమ్ముళ్లు చేసిన ఆరోపణలను కూడా గట్టిగా తిప్పికొట్టాడు పవన్… మీ పౌరుషం నా దగ్గర కాదు కేంద్రం దగ్గర చూపించండి, ప్రత్యేక హోదా నన్ను తిడితే రాదంటూ రివర్స్ ఎటాక్ చేసాడు గబ్బర్ సింగ్ .

CLICK: పవన్ ను దించేశాడు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top