పవన్ సినిమా కు మహేష్ నిర్మాత!!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబులకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. నిజంగా చెప్పాలంటే నెంబర్ వన్ స్థానానికి  వీరిద్దరి మధ్యే పోటి ఉంటుంది.  కానీ వీరిద్దరికి  మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాసే…. అతడు తో మహేష్ రేంజ్ ను చూపించిన త్రివిక్రమ్ అత్తారింటికి దారేది అంటూ పవన్ ను పీక్స్ కు తీసుకుళ్లాడు.. తాజాగా పవన్ తో త్రివిక్రమ్ ‘కోబలి’ అనే సినిమా తీస్తున్నాడని అందరికి తెలిసిందే.. ఈ సినిమాకు  సహ నిర్మాతగా వ్యవహరించడానికి మహేష్ బాబు ముందుకొచ్చాడట .

pawan-trivikram-mahesh

 

రాయలసీమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాల ఫై ఈ చిత్ర తెరకేక్కబోతుంది.  నిన్ననే శ్రీమంతుడు సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది…. ఈ సినిమాకు కూడా మహేష్ బాబు హ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  సొంత సినిమా కు నిర్మాతగా వ్యవహరించడంలో కొత్తేమీ లేకపోయిన….. త్రివిక్రమ్ డైరెక్షన్ లోని  పవన్ కోబలి  సినిమాకు మహేష్   నిర్మాతగా వ్యవహరించడం మాత్రం ఇటు పవన్ ఫ్యాన్స్, అటు ప్రిన్స్ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది. పవన్ కళ్యాణ్, మహేష్ ల మధ్య మంచి పరిచయాలు ఉండటంతోనే ఇది సాధ్య పడుతుందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

పవన్ హీరో, త్రివిక్రమ్ డైెక్షన్, మహేష్ నిర్మాత……  ఇది చాలు కోబలి బ్లాక్ బ్లాస్టర్ అవ్వడానికి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top