పవన్ చేతిలో గన్ పెట్టుకొని మీడియాతో మాట్లాడిన రోజు గుర్తొచ్చింది.

రేపు పవన్ బర్త్ డే అని సోషల్ మీడియాలో ఈరోజు నుండే చాలా మంది పవర్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుతున్నారు. వాటిని చూశాక  నా మైండ్ ఎందుకో చాలా రోజుల క్రితం పవన్ ఇచ్చిన ఇంటర్య్వూ వైపుకు వెళ్లింది. ఆ ఇంటర్వ్యూ లో పవన్ ఓ చేతిలో గన్ పట్టుకొని మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పట్లో ఆ వీడియో చూసి షాక్ తిన్నాను.

డేట్ సరిగ్గా గుర్తులేదు.. కానీ బయటి నుండి వచ్చి టివి ఆన్ చేస్తున్న.. ఛానల్స్ మారుస్తున్న… TV-5 న్యూస్ ఛానల్ లో పవన్  తన రివాల్వర్ ను చేతిలో  పట్టుకొని మీడియా తో మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ ఛానల్ దగ్గర స్ట్రక్ అయ్యా.. పవన్ ఏంటి ?  చేతిలో రివాల్వర్ ఏంటి? మీడియాతో అలా మాట్లాడడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్న… పవన్ తన బాధను తన మాటల్లో తెలుపుతున్నాడు..  ఫస్ట్ టైం పవన్ అలా మాట్లాడడం చూశా… కానీ అతని మాటలు విన్నాక నాకు చాలా బాధేసింది.

Watch Video:

లవర్ ను ఇష్టపడి పెళ్లి చేసుకొని  తమకు ప్రాణ హాని ఉందని చెప్పిన చిరంజీవి చిన్నకూతురు  శ్రీజ మాట కోసం తన  లైసెన్స్డ్  రివాల్వర్ ను పోలీస్ స్టేషన్ లో ఇవ్వడానికి వచ్చిన పవన్ అప్పుడు అలా మాట్లాడారు. నిజమైన ప్రేమ పారిపోదు అంటూ చక్కని సందేశం కూడా ఇచ్చారు.

 

—————————————————–చంటిగాడు.

 

CLICK:  పవన్ బర్త్ డే కు రేణు దేశాయ్ గిఫ్ట్.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top