దటీస్ పవన్ కళ్యాణ్… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వాళ్లందరినీ పిలిచి…బ్యాలెన్స్ ఇచ్చి పంపాడట.!?

నేను ఆకాశం లాంటోడిని….ఉరుమొచ్చినా….మెరుపొచ్చినా..పిడుగొచ్చానా.అంతే ఉంటా.!  ఈ డైలాగ్ కు పర్ఫెక్ట్ రూపం పవన్ కళ్యాణ్… ఆయన సినిమా హిట్ అయినా..సూపర్ హిట్ అయినా…బ్లాక్ బాస్టర్  అయినా…ఫ్లాఫ్ అయినా….ఆయన మాత్రం అలాగే  ఉంటారు. అందరితో కలుపుగోలుగా….అందరి మంచి జరగాలని ఆరాటపడే వ్యక్తిగా…తాజాగా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న ఓ సమాచారం వింటే మాత్రం మనమంతా పవన్ కళ్యాణ్ మంచితనాన్ని తప్పకుండా మెచ్చుకుంటాం..అంత మెచ్చుకునే పని పవన్ ఏం చేశాడనేగా????

pawankalyan-gabbarsingh

ఎన్నో అంచనాల మద్య విడుదలైన పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్ల సునామినే కురిపించింది. అయితే క్రమంగా డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.. ఇదిలా ఉంటే పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్ర్యూ కి బాకీ ఉన్న ఎమౌంట్ ను మొత్తం అందరిన ఇంటికి పిలిచి మరీ ఇచ్చాడంట.! దీంతో వాళ్ళ ఆనందానికి హద్దులేవంట… పవన్ ల్లాంటి స్టార్ ఇంటికి పిలిచి మరీ బ్యాలెన్స్ ఇచ్చి పంపించడం…పవన్ కు ఒక్కడికే సాధ్యం అంటున్నారట వాళ్లంతా….అంతేకాదు సర్ధార్ సినిమాతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు  కూడా తన కొత్త సినిమా ని రీప్లేస్ చేయడం ద్వారానో.. లేదా డబ్బునో తిరిగి ఇచ్చే యోచనలో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

43714

నిజంగానే సినిమా అంటే కోట్ల రూపాయలతో ఆటలు…హిట్ అయితే రాత మారినట్టు…ఫట్ అయితే కోలకోవడం కష్టమే…నిర్మాతలకు సినిమా అంటే వైకుంఠపాలి ఆటలాంటిదే అని చెప్పక తప్పదు.. స్టార్ హీరోలకు కోట్లలో రెమ్యునరేషస్ ఇవ్వాలి…అధిక లాభాలొస్తే షేర్లు ఇవ్వాలి… ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం…హీరోలు మాత్రం ఆ నిర్మాత వైపు కన్నెత్తి కూడా చూడరు అని చాలా మంది నిర్మాతలు చాలా సార్లు బాహాటంగానే మొత్తుకున్న పరిస్థితి.

Comments

comments

Share this post

scroll to top