“గణేష్ నిమర్జనం” లో రాళ్లతో ఒకర్నొకరు కొట్టుకున్న “మహేష్ – పవన్” ఫాన్స్..! కారణం తెలుసా..? [VIDEO]

సినిమా నటులంటే అభిమానం ఉండాలి, కానీ అది పిచ్చిగా మారకూడదు. ఒక నటుడిని ఇష్టపడటం, అభిమానించడంలో తప్పు లేదు. కానీ అదే అభిమానం ఇతరులకు ఇబ్బంది కలిగించే పరిస్థితికి దారి తీస్తే దాన్ని పిచ్చి  కాకుంటే మరేమంటారు. అభిమానాన్ని ప్రదర్శించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది.అభిమానం అనేది హుందాగా  ఉంటే మీరు అభిమానించే హీరోలు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. తమ పేరు నిలబెడుతున్నారని సంతోష పడతారు. కానీ మీ ప్రవర్తన కారణంగా మీ హీరోనే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే? ఒక్క సారి ఆలోచించండి. అయితే అందరూ అలాంటి వారు కాదు, వారిలో ఉండే అతికొద్దిమంది వల్లే వచ్చింది అసలు ఇబ్బంది.

ఒకప్పుడు అభిమానులు,అభిమాన సంఘాలు వేరు..ఇప్పుడు మాత్రం ఏదో ఒక గొడవ రూపంలోనే హీరోలకంటే ఎక్కువగా ఫ్యాన్స్ వార్తల్లో కెక్కుతున్నారు.నిన్న మొన్న కత్తి మహేశ్ పై ఫ్యాన్స్ వార్,అల్లు అర్జున్ కి వ్యతిరేఖంగా ఫ్యాన్స్ తీరు..ఇంతకుముందు ఎన్జీఆర్ ,పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవ తాజాగా పవన్ ఫ్యాన్స్,మహేశ్ ఫ్యాన్స్ మధ్య రక్తాలు వచ్చేలా కొట్టుకునేంత గొడవ తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది..ముమ్మడివరంలో గణేశ్ నిమజ్జనం అని మహేశ్ ఫ్యాన్స్ పేల్చిన తారాజువ్వలు,బాంబులతో పవన్ ఫ్లెక్సీలు కాలిపోయాయి.ఇది ఉద్దేశ్యపూర్వకంగానే జరిగింది అని పవన్ ఫ్యాన్స్ గొడవకు దిగారు..రాళ్లు రువ్వుకోవడం ,సోడాసీసాలు విసురుకోవడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి..ఊర్లోవాళ్లందరు కలగచేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

watch video here:

 

Comments

comments

Share this post

scroll to top