పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘లోఫర్’ చిత్ర ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయిన ప్రభాస్ కాస్తంత అసౌకర్యానికి గురైయ్యారు, స్టేజ్ మీద ప్రభాస్ మాట్లాడుతున్నంత సేపు గ్యాలరీ లో ఉన్న ఫ్యాన్స్ పవర్ స్టార్..పవర్ స్టార్..పవర్ స్టార్… అని నినాదాలు చేస్తుండడంతో తాను మాట్లాడాలనుకున్న మాటలను కుదించినట్టు తెలుస్తుంది. ప్రభాస్ స్టేజ్ ఎక్కినప్పటి నుండి ఫ్యాన్స్ ఇలాగే నినాదాలు చేస్తుండంతో వాళ్లను శాంత పరిచే ఉద్దేశ్యంతో యస్ ఐ లైక్ పవర్ స్టార్ అని అన్నారు ప్రభాస్ . అప్పటి వరకు సైలెంట్ అయిన ప్యాన్స్ మళ్లీ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరవడం స్టార్ట్ చేశారు. . మొత్తానికి ఆడియో పంక్షన్ అంతా పవర్ స్టార్ నామస్మరణతోనే జరిగిపోయిందన్న మాట!
Watch Video: