పవన్ పుట్టిన రోజుకి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ గిఫ్ట్.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ బర్త్ డే ను ఘనంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు …. పవన్ ఫ్యాన్స్ . రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు  భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. వీటితో పాటు  ప్లాంట్ ఎ ట్రీ పోగ్రాం ను కూడా  ప్రారంభించనున్నారు అయితే ఈ కార్యక్రమంలో పవన్  మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పాల్గొనబోతున్నారట. సెప్టెంబర్ 2న ప్లాంట్ ఎ ట్రీ పోగ్రాంకు సంబంధించిన ఫోటో చూపించగా పవన్ కూడా అభినందించి ప్రారంభించు అన్నారని ట్విట్ చేసింది రేణు దేశాయ్.

అయితే గత కొంతకాలంగా రేణు దేశాయ్ పవన్ పై ఎక్కడా లేని ప్రేమ కురిపిస్తుంది. చాలా మంది మళ్లీ పవన్ రేణూలు ఒక్కటవుతారు అనుకుంటున్నారు. జానీ సినిమాతో నిజజీవిత భాగస్వాములైన ఈ జంట కొన్ని కారణాల రీత్యా విడిపోవడం. పవన్ ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చకాచకా జరిగిపోయాయ్. పర్సనల్ లైఫ్ ను పక్కన పెడితే..

renu

పవన్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకుందాం. అభిమాన హీరోల బర్త్ డే కు డబ్బులు వృధా ఖర్చు చేయకుండా ఇటువంటి మంచి పనులను చేపడుతున్న పవన్ అభిమానులను ప్రశంసించాల్సిందే.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top