వ‌స్తువుల నాణ్య‌త‌ లేమి కారణంగా “పతంజలి” కి 11 లక్షల ఫైన్ వేసిన కోర్ట్.!

ఆయుర్వేదిక్ ప్లేవర్+ రామ్ దేవ్ బాబా మార్కెటింగ్ స్ట్రాటజీ+ స్వదేశీ వస్తువలు అనే ట్యాగ్ లైన్…దీంతో పతంజలి సంస్థ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. బిస్కిట్ల నుండి షాంపూ దాక అన్ని వస్తువులు పతంజలి బ్రాండ్ పేరుతో మార్కెట్ ను ముంచేశాయ్. భారత మార్కెట్ ను శాసించేలా దూసుకెళుతున్న పతంజలి ప్రొడక్ట్స్ కు షాకిచ్చింది ఉత్త‌రాఖండ్ లోని రుద్రాపూర్ కోర్టు.వ‌స్తువుల్లో నాణ్య‌త లేకున్నా ఉంద‌ని న‌మ్మిస్తూ, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పట్టిస్తున్న యాడ్స్ ప్ర‌ద‌ర్శిస్తున్నందుకు పతంజ‌లి సంస్థ‌కు రూ.11 ల‌క్ష‌ల ఫైన్ వేసింది.

ఇతర కంపెనీలకు చెందిన వస్తువుల మేకింగ్ ఫార్ములాను కాపీ కొట్టి..వస్తువులను తయారు చేసి వాటిని పతంజలి బ్రాండ్ తో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.  ఆయుర్వేదం పేరు చెప్పి, స్వదేశీ తయారీ వస్తువులనే  ట్యాగ్ లైన్ ను తగిలించి, బాబా రామ్ దేవ్ లాంటి వ్యక్తిని ముందు పెట్టి పతంజలి సంస్థ కోట్లలో లాభాలు గడిస్తుందనే ఆరోపణలూ ఉన్నాయి. మొదట ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కే పరిమితమైన పతంజలి….ఇప్పుడు సబ్బులు, షాంపూలు, సర్ఫ్ లతో పాటు నిత్యవసర సరకులు మీద దృష్టి పెంచి….తన మార్కెట్ ను విస్తరిస్తున్న సమయంలో…కోర్ట్ నుండి ఇటువంటి తీర్పు రావడంతో పతంజలి సంస్థకు పెద్ద దెబ్బే…నాణ్యత విషయంలో రాజీలేదని చెప్పకుంటున్న పతంజలి ప్రొడక్స్ లో నాణ్యత అంతగా లేదని కోర్ట్ తీర్పు ఇవ్వడం పెను సంచలనమే.!

మళ్లీ రామ్ దేవ్ బాబా…ఎటువంటి స్ట్రాటజీతో…ఎటువంటి యాడ్  తో జనాలను ఆకట్టుకుంటాడో చూడాలి.

patanjali

Comments

comments

Share this post

scroll to top