రుచి సోయాకు పతంజ‌లి బిగ్ ఆఫ‌ర్

ఇండియ‌న్ మార్కెట్‌ను చేజిక్కించు కోవాల‌ని చూసిన ఫారిన్ కంపెనీల‌కు కోలుకోలేని దెబ్బ కొట్టింది ప‌తంజ‌లి సంస్థ‌. అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే అన్ని వ‌స్తువుల‌ను అమ్ముతోంది ..కోట్లాది రూపాయ‌ల‌ను గ‌డిస్తోంది. ప్ర‌తి ఊరుకు ప‌తంజ‌లి విస్త‌రించింది. రోజు రోజుకు న్యూ ట్రెండ్స్‌ను సృష్టిస్తూ ఇత‌ర కంపెనీల‌కు కోలుకోలేని షాక్ ఇస్తోంది. ఇప్ప‌టికే అప్పుల ఊబిలో కూరుకు పోయి..దిక్కు తోచ‌ని స్థితిలో వున్న రుచి సోయా ఇండ‌స్ట్రీస్‌ను ప‌తంజ‌లి ఆయుర్వేదం స్వాధీనం చేసుకోనుంది. సోయాను స్వంతం చేసుకునేందుకు 4 వేల 325 కోట్ల బిడ్‌ను దాఖ‌లు చేసింది. రుచి సోయా 9 వేల 300 కోట్ల అప్పులు చెల్లించ‌క పోడంతో రుణ దాత‌లు నేష‌న‌ల్ కంపెనీ లా ట్రిబ్యున‌ల్ దివాలా పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

దీంతో రుచి సోయాను అప్ప‌జెప్పేందుకు బిడ్‌ల‌ను పిలిచారు. ఈ కంపెనీ పాల‌కు ఇండియా వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంటోంది. దీంతో డిమాండ్ పెర‌గ‌డంతో అదానీ విల్మార్, ప‌తంజ‌లి ఆయుర్వేద సంస్థ‌లు పోటీ ప‌డ్డాయి. అత్య‌ధిక బిడ్డ‌ర్‌గా అదానీ ఉన్నా..ఎందు వ‌ల్ల‌నో వెన‌క్కు త‌గ్గింది. దీంతో మ‌ళ్లీ బిడ్ దాఖ‌లు చేసే అవ‌కాశం ప‌తంజ‌లికి ఛాన్స్ ఇచ్చారు. తిరిగి 4 వేల‌కు పైగా బిడ్ దాఖ‌లు చేసింది. ప‌తంజ‌లి చేసిన ప్ర‌తిపాద‌న‌కు అనుకూలంగా రుణ దాత‌ల‌లో 96 శాతం మంది ఓటు అనుకూలంగా వేశారు. రుచి సోయా స్వాధీనం చేసుకోవ‌డంతో సోయాబీన్ ఆయిల్స్, సంబంధిత ఉత్ప‌త్తుల‌తో పెద్ద ప్లేయ‌ర్ల‌లో ఒక‌టిగా ప‌తంజ‌లి అవుతుంది. అంతేకాకుండా రుచి సోయా కంపెనీ పున‌రుద్ధ‌ర‌ణ‌కు ఇంకో 1700 కోట్ల‌ను ప‌తంజ‌లి ఆయుర్వేద ఖ‌ర్చు చేయ‌నుంది.

బ్యాంకుల‌కు, రుణ దాత‌ల‌కు రుచి సోయా బ‌కాయి ప‌డిన మొత్తం 9 వేల 345 కోట్లు. ఎస్బీఐ 1800 కోట్లు, సెంట్ర‌ల్ బ్యాంక్ 816 కోట్లు, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ 743 కోట్లు, స్టాండ‌ర్డ్ ఛార్ట‌ర్ బ్యాంకు 608 కోట్లు రుణంగా రుచి సోయాకు ఇచ్చాయి. రుచి సోయా ఇండ‌స్ట్రీస్ కు దేశంలోని వివిధ ప్రాంతాల‌లో త‌యారీ యూనిట్లు ఇప్ప‌టికే ఉన్నాయి. న్యూ ట్రెలా, మ‌హా కోష్, స‌న్ రిచ్, రుచి స్టార్, రుచి గోల్డ్ వంటి ప్ర‌ముఖ బ్రాండ్ల‌న్నీ రుచి సోయాకు చెందిన‌వే. భారీ మార్కెట్‌ను స్వంతం చేసుకున్న ప‌తంజ‌లి..ఇపుడు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. వ్య‌వ‌సాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల మీద ఫోక‌స్ పెడుతోంది. స‌బ్బులు, నూనెలు, ఇత‌ర వ‌స్తువుల‌న్నీ పతంజ‌లి స‌ర‌ఫ‌రా చేస్తోంది. పాల స‌ర‌ఫ‌రాలో తెలుగు రాష్ట్రాల‌లో మార్కెట్ వాటా చేజిక్కించుకుని ఆదాయం గ‌డిస్తున్న కంపెనీలకు ఇపుడు ప‌తంజ‌లి సోయా పాల‌తో పోటీ ఇవ్వ‌నుంది. దీంతో మ‌రింత ఆదాయం గ‌డించాల‌న్న‌దే ప‌తంజ‌లి వ్యూహం.

Comments

comments

Share this post

scroll to top