బ్యాంక్ లకు చేరిన పాత 500/- 1000/- నోట్లను ఏం చేస్తారో తెలుసా?

మోఢీ నిర్ణయం తర్వాత….. బ్యాంక్ లలోకి  పాత 500/- 1000/- రూపాయల నోట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరుతున్నాయి. ఇలా బ్యాంకులలో గుట్టలుగా ఉన్న నోట్లకు సమానమైన విలువగల కొత్త నోట్లను ఇచ్చి  RBI ఆ పాత నోట్లను  తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అలా తీసుకున్న నోట్లను ఎవరికీ తెలియకుండా కొంత మంది అధికారుల  సమక్షంలో కాల్చడమో…? లేదా… అతిచిన్న ముక్కలుగా కత్తిరించడమో చేస్తుందని RBI మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. అయితే ప్రస్తుతమున్న పాత నోట్లు పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి…వాటిని ముక్కులుగా కత్తిరించడం కంటే ఒకేసారి కాల్చేయడమే బెటర్ అని అనుకుంటుందట RBI.

కాల్చడం/ కత్తిరించడం కంటే ముందే జరిగే పని:

CVPS ( కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రోసెసింగ్ సిస్టమ్ ) తమకు వచ్చిన నోట్లను పరిశీలిస్తుంది, ఆ లెక్కలన్నీ ఓకే అని నిర్థారించుకున్నాకే, పాత నోట్లను ఏం చేయాలన్నది నిర్ణయిస్తారు. CVPS గంటకు 60,000 లకు పైగా కరెన్సీ నోట్లను చెక్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.

main-qimg-e9227f7f3d7b91be2d629ab759134d67-c

పాత నోట్లను ఇంకా ఎం చేస్తారు?:

  • అయితే….పాత నోట్లను కాల్చాక ఏర్పడ్డ బొగ్గును ….టెండర్లు పిలిచి ఇండస్ట్రీలకు  100gms  కి 6/- రూపాయల చొప్పున అమ్మేవారట! ( గతంలో ).
  • అంతేకాదు…కత్తిరించిన నోట్లను…..రీసైక్లింగ్ చేసి…. అందమైన క్యాలెండర్లు, ఫైల్స్ గా తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారట.!!

burnt-currency-notes-bareilly_650x400_71478698530

సాధారణంగా బ్యాంక్ లు డబ్బును ఎలా సరఫరా చేస్తాయి:

సాధారణంగా అయితే….ప్రతి మెయిన్ బ్యాంక్ వాటి వాటి పరిధులను బట్టి…తమ తమ బ్రాంచ్ లలో కొంత డబ్బు నిల్వ ఉంచుకోడానికి అనుమతినిస్తాయి. మ్యాగ్జిమమ్ 2 కోట్ల రూపాయల వరకు తమ బ్రాంచ్ లలో నిల్వ ఉంచుకోడానికి ఆస్కారం ఉంటుంది. దానిని మించితే ….బ్రాంచ్ ఆఫీస్ ఆ లెక్కలన్నీ తెల్పుతూ…ఆ డబ్బును  మెయిన్ బ్రాంచ్  కు పంపాల్సి ఉంటుంది. ఇలా తమకింది బ్రాంచ్ ల నుండి వచ్చిన డబ్బును హెడ్ ఆఫీస్ లు…డబ్బు అవసరం ఉన్న ఇతర బ్రాంచ్ లకు పంపిస్తాయి. ఇలా మనీని సర్క్యులేట్ చేస్తాయి మెయిన్ బ్రాంచ్ లు.

currencyrbi

అయితే మోఢీ తాజా నిర్ణయంతో….. ఒక్కొక్క బ్రాంచ్ లో 10 కోట్లకు మించిన డబ్బులు ఉన్నట్టు సమాచారం…సాధారణంగా 2 కోట్లకు మించితేనే మెయిన్ బ్రాంచ్ కు పంపాల్సి ఉన్నప్పటికీ….ఇవి అమలులో లేని నోట్లు కాబట్టి…వాటిని బ్రాంచ్ లలోనే ఉంచుతున్నారు.  ఉన్న సిబ్బంది అంతా బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో…వీటి లెక్కలు తేల్చే వాళ్లు కూడా లేకపోవడంతో ఎక్కడి డబ్బులు అక్కడే ఉండిపోయాయి. త్వరలోనే ఈ డబ్బంతా పూర్తి వివరాలతో RBI కు చేరుతుంది.

Comments

comments

Share this post

scroll to top