బ‌స్సులు, రైళ్ల‌లా ఎవ‌రైనా విమానంలో నిల‌బ‌డి ప్ర‌యాణం చేస్తారా..? కానీ అక్క‌డ అలాగే చేశారు..!

పండుగ‌లు, ఇత‌ర సీజ‌న్ల‌లో మ‌నం బ‌స్సు లేదా రైలులో ప్రయాణించినప్పుడు… లేదంటే హైద‌రాబాద్ వంటి మ‌హాన‌గ‌రాల్లో సిటీ బ‌స్సుల్లో వెళ్లిన‌ప్పుడు… ఇంకా ఇత‌ర సంద‌ర్భాల్లో మ‌నం అప్పుడ‌ప్పుడు సీట్లు ఖాళీ లేక‌పోతే వాటిలో నిల‌బ‌డి ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తుంది క‌దా..! ఇక మ‌రీ జ‌నాలు ఎక్కువైతే ఫుట్ బోర్డింగ్ చేయ‌కా త‌ప్ప‌దు. అయితే విమానంలో అది సాధ్య‌మ‌వుతుందా..? అంటే… సాధ్య‌మ‌వుతుంద‌నే చెప్పాలి. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే..! అది ఎందుకో తెలుసా..? అదేంటో మీరే చ‌దివి తెలుసుకోండి..!

pakisthan-flight

ఈ సంఘ‌ట‌న జ‌రిగింది ఒక నెల కింద‌ట‌. అంటే ఆ రోజు జ‌న‌వ‌రి 20వ తేదీ. పాకిస్థాన్‌లోని క‌రాచీ ఎయిర్ పోర్టు. అప్పుడే సౌదీ వెళ్లాల్సిన పీకే-743 అనే బోయింగ్ 777 విమానం టేక్ ఆఫ్‌కు ఎయిర్ పోర్టు ర‌న్ వేపై సిద్ధంగా ఉంది. ఆ ఫ్లైట్ సామ‌ర్థ్యం 409 మంది. కానీ అప్ప‌టికే అందులో 416 మంది ఎక్కారు. అంటే 409 మంది పోను మ‌రో 7 మంది ఎక్స్‌ట్రా ఎక్కార‌న్న‌మాట‌. మ‌రి వారు తెలియ‌క ఎక్కారా..? లేదంటే టిక్కెట్ కొన‌లేదా..? మ‌రేదైనా కార‌ణాలు ఉన్నాయా..? అంటే.. అలా కాదు..! టిక్కెట్ కొన్నారు. మ‌రి టిక్కెట్ కొంటే అలా ఎందుకు నిల‌బ‌డ‌డం అంటే… సీటింగ్ కెపాసిటీ 409 మందే క‌దా..! మ‌రి ఎక్కువ‌గా ఉన్న‌వారు ఎలా కూర్చుంటారు..? నిల‌బ‌డాల్సిందే..! ఈ క్ర‌మంలో వారు కూడా అలాగే చేశారు. అంత‌లోనే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. అయితే విమానంలో కెపాసిటీకి మించి ప్యాసింజ‌ర్లు ఎక్కారని ఆ త‌రువాతే పైల‌ట్‌కు తెలిసింది.

pakisthan-flight-passengers

కానీ పైల‌ట్ ఫ్లైట్‌ను వెన‌క్కి మ‌ళ్లించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఎందుకంటే అలా చేస్తే ఎన్నో వేల లీట‌ర్ల ఇంధ‌నం వృథా అవుతుంది. అందుక‌ని ఫ్లైట్‌ను య‌థాత‌థంగా న‌డిపాడు. దీంతో ఎక్స్‌ట్రా ప్యాసింజ‌ర్ల‌తోనే ఆ విమానం గ‌మ్య‌స్థానం చేరుకుంది. అలా వారు 3 గంట‌ల‌కు పైగానే నిల‌బ‌డి విమానంలో ప్ర‌యాణించారు. అయితే ఇప్పుడిదే విష‌యం నెట్ లో వైర‌ల్ అవుతోంది. సాధార‌ణంగా మ‌నం బ‌స్సులు, రైళ్ల‌లోనే నిల‌బ‌డి ప్ర‌యాణం చేస్తాం. విమానాల్లో అస‌లు అలా జ‌రిగే అవ‌కాశ‌మే లేదు. కానీ… అది పాకిస్థాన్ క‌దా. ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు. అందుకే అక్క‌డి ప్ర‌యాణికులు ఏకంగా విమానంలోనే నిల‌బ‌డి ప్ర‌యాణం చేసి అంద‌రినీ షాక్‌కు గురి చేశారు. దీంతో ఈ విష‌యం తెలిసిన వారంద‌రూ న‌వ్వ‌క మాన‌డం లేదంటే న‌మ్మండి. మ‌రి మిస్టేక్ ఎక్క‌డ జ‌రిగిందంటారా..? అది టిక్కెట్లు ఇష్యూ చేసే వారి దగ్గ‌రే.

కంప్యూట‌ర్ జ‌న‌రేటెడ్ లిస్ట్ అప్ప‌టికే విమాన సిబ్బందికి చేరుకోగా, దాని వివ‌రాలు లేకుండానే ఎయిర్ పోర్టు సిబ్బంది ఆ ఫ్లైట్‌కు టిక్కెట్ల‌ను ఇష్యూ చేశార‌ట‌. అలా ఇష్యూ చేసిన టిక్కెట్లు చేతితో రాసిన‌వి. కంప్యూట‌ర్ ద్వారా ఇచ్చిన‌వి కావు. దీంతో ఆ సిబ్బంది ఫ్లైట్ నిండిందా, లేదా అనేది చూడ‌కుండానే టిక్కెట్లు ఇచ్చారు. ఏదీ… మన ద‌గ్గ‌ర సినిమా ఆడియో ఫంక్ష‌న్ల‌కు, స్పోర్ట్స్ మ్యాచ్‌ల‌కు ప‌రిమితి మించి టిక్కెట్లు ఇస్తారు క‌దా, అలా అన్న‌మాట‌. ఆ క్ర‌మంలో ఆ ఎక్స్‌ట్రా ప్యాసింజ‌ర్లు ఫ్లైట్‌లోకి వెళ్లాక‌, తీరా విష‌యం తెలియ‌డంతో నిల‌బ‌డ‌క త‌ప్ప‌లేదు. అయినా ఏం చేస్తారు… డ‌బ్బులు పెట్టి కొన్న టిక్కెట్లు క‌దా… చ‌చ్చిన‌ట్టు ప్ర‌యాణం చేయాల్సిందే. లేదంటే ఆ డ‌బ్బు వేస్ట్ అవుతుంది క‌దా..! అన్న‌ట్టు ఇంకో విష‌యం… ఆ విమానం ఏ కంపెనీదో తెలుసా..? విజ‌య్ మాల్యాది కాదు లెండి… పాకిస్థాన్ నేష‌నల్ కారియ‌ర్‌ది..!

Comments

comments

Share this post

scroll to top