20 రూపాయ‌ల పెన్ను…పూజ చేసి 1900 కు అమ్ముతున్నారు….ఈ పెన్ తో ప‌రీక్ష రాస్తే..పాస్ గ్యారెంటీ!!

ఎగ్జామ్ ఫీవర్ స్టార్ట్ అయింది..ఒక్కొక్కరికీ ఒక్కో టెన్షన్…మంచి మార్కులు రావాలని ఒకరు…క్లాస్ ఫస్ట్ రావాలరి మరొకరు…టాపర్ అవ్వాలనుకునే ఇంకొకరు…కనీసం పాస్ అయితే చాలు అనుకునే కొందరు….ఇలా ఎన్నో ఆలోచనలు…ఎంత చదివినా కూడా మనసులో ఏదో టెన్షన్ ఉంటుంది..అలాంటి వాళ్లందరి వీక్ నెస్ నే క్యాష్ చేసుకుంటుంది…ఒక పెన్నుల కంపెనీ….

గుజరాత్ లోని పంచమహల్ లోని కాష్టబంజన్ అనే గుడిలో వీరాంజనేయస్వామి కొలువై  ఉన్నాడు…ఇక్కడ 20రూపాయల పెన్నులను పూజ చేయించి 1900కు అమ్ముతున్నారు…దీనికోసం విధ్యార్ధులు చేయాల్సిందల్లా వారి హాల్ టికెట్,కాలేజ్ ఐడీ జెరాక్స్…ఫోన్ నెంబర్ ఇవ్వాలట..ఇలా చేయకపోతే మళ్లీ ఆంజనేయ స్వామి కరుణించరట…ఈ పెన్నుతో రాస్తే ఇంటరు,డిగ్రీ ఏ కాదు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా ఈజీగా పాసయిపోతారట…గుడి సిబ్బంది పేరెంట్స్ ,స్టూడెంట్స్ టెన్షన్ ను క్యాష్ చేసుకుంటూ….పెన్నుతో రాస్తే పాసవుతావ్ లేదంటే మీ కర్మ అని భయపెడ్తున్నారట… మరోవైపు కొందరు ఏడాదంతా చదవకుండా ఎలా పాసవుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు…ఈ పెన్నుల వ్యాపారం గుజరాత్ లోనే కాక ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తుంది…

కష్టే ఫలి అని అన్నారు పెద్దలు..ఎవరో ఒకరు పాసవుతున్నారని పెన్నుతో రాస్తే చాలు అనుకుంటే మళ్లీ ఏడాది వరకు ఆగాలి…కాబట్టి కష్టాన్ని నమ్ముకోండి…మీ కష్టం నిజమైతే మీరు నమ్మే దేవుడు మీకు మంచే చేస్తాడు..

Comments

comments

Share this post

scroll to top