మహిళ పట్ల అసభ్య పదజాలం వాడినందుకు చిలుక అరెస్ట్.

టైటిట్ చూసి… ఓ క్షణం షాక్ కొట్టినట్టయ్యిందా..? సేమ్ ఫీలంగ్ ఇక్కడ కూడా.. కానీ ఇది  నిజం అక్షరాల నిజం, tv9 సాక్షిగా నిజం. మహిళ పట్ల అసభ్య పదజాలం వాడినందుకు రామ చిలుకను అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్ర లో జరిగింది.  మహారాష్ట్ర లోని చంద్రాపూర్ గ్రామంలో ఓ ఇంటి బాల్కానీ పై వాలిన చిలక,.. జానాబాయ్ అనే మహిళను బూతులు తిట్టిందట. చెప్పుకోలేని బూతులు తిట్టిందని… చిలుక పై పోలీసులకు పిర్యాదు చేసింది సదరు మహిళ.

దీంతో పోలీసులు చిలుకను అరెస్ట్ చేసి. లాకప్ లో ఉంచారు. లాకప్ లో ఉన్న చిలుక ఎంతకీ మాట్లాడకపోవడంతో పోలీసులు చిలుకను అడవిలో వదిలేశారు. వినడానికి ఫన్నీగా ఉంది కదూ… ఏం చేస్తేం కలికాలం.మొన్నటికి మొన్న ఓ ఉడత మహిళను వేధిస్తే,, ఈ చిలకమ్మేమో ఇలా  బూతు పురాణం చదివేసింది.

ఏమో  ఆ  చిలకమ్మ, సదరు మహిళ  పోయిన జన్మలో సవతులో… లేక గత జన్మలో  పబ్లిక్ టాప్ వద్ద   గొడవ పెట్టుకున్న పక్క పక్క ఇళ్లోళ్లో  …అనే సెటర్లు విసురుతున్నారు నాబోటి వాళ్ళు.

ఇక వీడియో చూడండి… (tv-9 సౌజన్యంతో…)

CLICK: ఊరిపై యుద్దాన్ని ప్రకటించిన చీమలు …ఊరువిడిచి పారిపోతామంటున్న గ్రామస్థులు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top