నెల్లూరులో బస్సు దిగగానే..అతనిని పోలీసులు అరెస్ట్ చేసారు.! ఎందుకో తెలుసా.? కారణం ఫేస్బుక్ పరిచయం!

ఫేస్‌బుక్ అనేది నేటి త‌రుణంలో మాట‌లు చెప్పుకోవ‌డానికి, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను షేర్ చేసుకోవ‌డానికి, టైం పాస్ చేయ‌డానికి మాత్ర‌మే కాదు.. కొంద‌రు వ్య‌క్తుల‌కు మోసాలు చేసేందుకు అడ్డాగా కూడా మారింది. ఫేస్‌బుక్ ద్వారా ఓ యువ‌తికి ఓ యువ‌కుడు పరిచ‌యం అయ్యాడు. దీంతో వారిద్ద‌రికీ అందులో స్నేహం కుదిరింది. కానీ అత‌ను మాత్రం ఆమెను న‌మ్మించి మోసం చేశాడు. ప్రాజెక్ట్ వ‌ర్క్ చేస్తున్నాన‌ని, డ‌బ్బులు పెట్టుబ‌డి పెడితే లాభం పొంద‌వ‌చ్చ‌ని అత‌ను చెప్ప‌గా ఆమె స‌రే అని పెద్ద మొత్తంలో అత‌నికి డ‌బ్బు చెల్లించింది. తీరా అత‌ను చివ‌ర‌కు మోసం చేశాడు. దీంతో ఆ యువ‌కుడికి ఆ యువ‌తి స‌రైన రీతిలో బుద్ధి చెప్పింది. ఇంత‌కీ అస‌లు ఏం జరిగిందంటే…

నెల్లూరులోని కలువాయి మండలం రామన్న గారిపల్లెకు చెందిన ఎస్‌ లావణ్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. 3 ఏళ్ల క్రితం ఒంగోలుకు చెందిన సురేష్‌ అనే యువకుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. సురేష్‌ కూడా హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తుండడంతో ఇద్దరికి మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఇదే స్నేహాన్ని ఆస‌రాగా చేసుకున్న సురేష్ లావ‌ణ్య‌ను మోసం చేశాడు. ప్రాజెక్ట్ వ‌ర్క్ చేస్తున్నాన‌ని, డ‌బ్బులు పెట్టుబ‌డి పెడితే మంచి లాభం వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో లావ‌ణ్య అది నిజ‌మే అని న‌మ్మి అత‌నికి విడ‌త‌ల వారీగా రూ.5.62 ల‌క్ష‌ల‌ను అత‌ని బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. కానీ చివ‌ర‌కు అత‌ను కాల‌యాప‌న చేస్తూ త‌న‌ను త‌న‌ ఫ్రెండ్ మోసం చేశాడ‌ని చెప్పి త‌ప్పించుకున్నాడు. దీంతో లావ‌ణ్య మోస‌పోయింది.

అయితే సురేష్ మ‌ళ్లీ ఏమ‌నుకున్నాడో తెలియ‌దు కానీ మ‌ళ్లీ లావ‌ణ్య‌కు ఫోన్ చేసి తానే సొంతంగా ప్రాజెక్ట్‌ వర్క్‌ ప్రారంభిస్తున్నానని, మరో రూ.3లక్షలు ఇస్తే వాటా ఇస్తానని, ఈ సారి కచ్చితంగా లాభాలు వస్తాయని లావ‌ణ్య‌ను నమ్మించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియచేసింది. కుటుంబ సభ్యులు పక్కా ప్రణాళిక రూపొందించుకుని లావణ్యతో సురేష్‌కు ఫోన్‌ చేయించారు. తాను తొలివిడతగా రూ.50వేలు నగదు ఇస్తానని, నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండు వద్దకు రావాలని కోరింది. దీంతో సురేష్‌ హైదరాబాద్‌ నుంచి సోమవారం నెల్లూరు ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. అయితే అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న లావణ్య, ఆమె కుటుంబ సభ్యులు కలిసి సురేష్‌ను పట్టుకుని అక్క‌డి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్క‌డికి చేరుకుని సురేష్‌ను అరెస్ట్ చేశారు. అలా లావ‌ణ్య రెండో సారి అత‌ని బారిన ప‌డ‌కుండా త‌ప్పించుకోవ‌డ‌మే కాదు, అత‌న్ని పోలీసుల‌కు ప‌ట్టిచ్చింది. ఏది ఏమైనా ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయ్యే ఇలాంటి వారి ప‌ట్ల ఎవ‌రైనా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top